Advertisementt

కాంతార ప్రీక్వెల్ లోకి బాలీవుడ్ బ్యూటీ

Sat 11th Feb 2023 09:02 PM
urvashi rautela,kantara 2  కాంతార ప్రీక్వెల్ లోకి బాలీవుడ్ బ్యూటీ
Kantara 2 To Have Bollywood Actress కాంతార ప్రీక్వెల్ లోకి బాలీవుడ్ బ్యూటీ
Advertisement
Ads by CJ

కన్నడ నుండి కాంతార అనే చిన్న సినిమా ఇండియాలోని పలు భాషా ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేసింది. కాంతార మ్యానియాతో, వరాహ రూపం సాంగ్ మ్యానియాతో ప్రేక్షలు ఊగిపోయారు. రిషబ్ శెట్టి దర్శకుడిగా, హీరోగా అద్భుతంగా చేసారు. కేవలం 16 కోట్లతో తెరకెక్కి ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లు కొల్లగొట్టి ఔరా అనిపించిన కాంతార కి ప్రీక్వెల్ ఉంటుంది అంటూ రిషబ్ శెట్టి ప్రకటించడంతో ఇప్పుడు కాంతార ప్రీక్వెల్ పై అందరిలో ఆసక్తి పెరిగిపోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టామని.. ఈ ఏడాది షూటింగ్ చేసి 2024 లో కాంతార ప్రీక్వెల్ ని రిలీజ్ చేస్తామంటూ రిషబ్ శెట్టి ఇచ్చిన అప్ డేట్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.  

అయితే కాంతార సినిమా ఆగిన దగ్గర నుండి కథ మొదలవుతుంది అంటే అది సీక్వెలా వుంటుంది. కానీ కాంతార మొదలైనప్పటి ముందు నుండి కాంతార 2 కథ మొదలవుతుంది. అంటే ప్రీక్వెల్ అన్నమాట. మరి ప్రీక్వెల్ కాంతార లో ఏం ఉంటాయో.. ఎలాంటి నేపథ్యం ఉంటుందో.. ఏయే నటులు కనిపిస్తారో.. ఈసారి ఎంత బడ్జెట్ తో తెరకెక్కుతుందో అనే లెక్కలు వేసే లోపులో కాంతార 2 లోకి బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి అడుగుపెడుతున్నట్టుగా రిషబ్ శెట్టి తో కలిసి దిగిన ఫోటో ని షేర్ చేస్తూ ఊర్వశి కన్ ఫర్మ్ చేసింది. 

బాలీవుడ్ లో గ్లామర్ డాల్ గా, వాల్తేర్ వీరయ్యలో బాస్ పార్టీ సాంగ్ తో మెస్మరైజ్ చేసిన ఊర్వశి రౌతేల్ల కాంతార 2 లో ఎలా కనబడుతుందో.. ఏ రోల్ చేస్తుందో అనే క్యూరియాసిటీ అప్పుడే అభిమానుల్లో మొదలైపోయింది.

Kantara 2 To Have Bollywood Actress:

Urvashi Rautela In Kantara 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ