పవన్ కళ్యాణ్ ఆహా అన్ స్టాపబుల్ షోకి రావడమే ఇప్పటికి ఎవ్వరూ నమ్మలేకపొతున్నారు. ఆయన ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి కానీ.. ఇంకా అభిమానులు అదే ఆశ్చర్యంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే పెద్ద తోపు.. అందుకే ఆయన టాక్ షోకి రారని కాదు. ఆయన నలుగురిలో ఉండే వ్యక్తి కాదు, ఎక్కువగా ఒంటరిగా గడిపే వ్యక్తి. సినిమాలు, రాజకీయాలు అంటూ బిజిగా వుంటున్నారు. ఆ సమయంలో నందమూరి బాలయ్య హోస్ట్ గా వస్తున్న టాక్ షోకి రావడం మాత్రం ఆహా వారికి పెద్ద సక్సెస్ అనే చెప్పాలి.
ఇప్పుడిప్పుడే ఆ సంభ్రమాశ్చర్యాలు నుండి బయటికి వస్తున్న ప్రేక్షకులకి ఇప్పుడు సింగర్ స్మిత మరో గుడ్ న్యూస్ చెప్పింది. స్మిత వ్యాఖ్యాతగా.. సోని లివ్ లో నిజం అనే షో వస్తుంది. మెగాస్టార్ చిరు, చంద్రబాబు నాయుడు, ఇంకా స్టార్ హీరోలు అటెండ్ అవుతున్న ఈ షోకి పవన్ కళ్యాణ్ వస్తారని ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా అని ఓ యాంకర్ అడిగితే.. పవన్ కళ్యాణ్ గారిని ఈ షోకి ఇన్వైట్ చేసాము, ఆయన కూడా ఈ షో వస్తామని కమిట్ చేసారు. కాకపోతే టైమ్ లైన్ ఒకటి ఆయన చెప్పినదాన్ని బట్టి అడిగారు. మీ ఇష్టమని చెప్పాము, తర్వాత ఆయన్ని అడగలేదు, ఈలోపు ఈ సీజన్ కంప్లీట్ అయ్యింది.. అని చెప్పిందావిడ.
ఇక ఆ యాంకర్.. పవన్ కళ్యాణ్ గారిని నిజం సెకండ్ సీజన్ లో చూడొచ్చేమో అని అడిగితే.. ఏమో చెప్పలేము అంటూ స్మిత ఆ ఆన్సర్ ని దాటవేసిన ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి నిజంగా పవన్ కళ్యాణ్ మరో టాక్ షో లో కనబడితే ఫాన్స్ కి పండగే.