Advertisementt

ఒకే చోట ఎన్టీఆర్ వైఫ్, బ్రాహ్మణి, నమ్రత

Sat 11th Feb 2023 12:18 PM
lakshmi pranathi,brahmani,namratha  ఒకే చోట ఎన్టీఆర్ వైఫ్, బ్రాహ్మణి, నమ్రత
Lakshmi Pranathi, Brahmani, Namratha at Formula E race ఒకే చోట ఎన్టీఆర్ వైఫ్, బ్రాహ్మణి, నమ్రత
Advertisement
Ads by CJ

స్టార్ హీరోలు ఒకరికోరు కలుసుకుంటేనే ఆ క్రేజ్ మాములుగా ఉండదు, అభిమానులకి పండగే. అందుకే ఒకరి సినిమా ఈవెంట్ కి మరొక హీరోని పిలుస్తుంటారు. అలాగే స్టార్ ఫామిలీస్ కలిసి కనబడితే ఆ సందడే వేరు. అందులోను స్టార్ హీరోల వైఫ్ లు ఒకే చోట చేరితే అది మరింత ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా హైదరాబాద్ లో జరుగుతున్న ఫార్ములా-ఇ రేసింగ్ ప్రాక్టీస్ చూడడానికి నిన్న శుక్రవారం టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలతో పాటుగా మాజీ సీఎం కోడలు, టిడిపి అధ్యక్షుడు లోకేష్ భార్య బ్రాహ్మణి హాజరు కావడంతో ఛానల్స్ లో స్పెషల్ గా కనిపించింది. 

ఫార్ములా-ఇ రేసింగ్ ప్రాక్టీసు చూడడానికి నారా బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్ రాగా.. వాళ్లతో పాటుగా స్టార్ హీరో ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి రావడం మరింత ఇంట్రెస్ట్ ని కలిగించింది. ఎందుకంటే బ్రాహ్మణి వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యామిలీ కాస్త డిస్టెన్స్ మెయింటింగ్ చేస్తారు. రీసెంట్ గా తారకరత్న కోసం బెంగుళూరు వెళ్ళినప్పుడు ఒకే పిక్ లో ప్రణతి-బ్రాహ్మణిలని చూసి నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేసారు. ఇప్పడు ఫార్ములా-ఇ రేసింగ్ చూడడానికి వీరిరువురు కలిసి రావడం, మంరింత ఆనందానికి గురి  చేసింది. ఇక ఈ రేస్ చూడడానికి  ప్రముఖ హీరో మహేష్ బాబు వైఫ్ నమ్రత కూడా వచ్చింది.

వీరంతా సెలెబ్రిటీ లాంజ్ లో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, అలాగే బ్రాహ్మణి, ప్రణతిలు స్నేహితులతో, పిల్లలతో కలిసి ఎంజాయ్ చెయ్యడం చూసిన వారు అబ్బ ఇలాంటి అరుదైన ఘటనలు మళ్ళీ ఎప్పుడు చూస్తామో అంటున్నారు. 

నమ్రత ఛానల్స్ తో మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఫార్ములా-ఇ రేసింగ్ జరగడం చాలా నచ్చింది. హైదరాబాద్ లో జరగడం ఇదే మొదటిసారి, గౌతమ్ కి ఈ రేసింగ్ అంటే చాలా ఇష్టం, గౌతమ్ కూడా ఈ రేస్ చూడడానికి వస్తాడు, మహేశ్ బాబు హైదరాబాదులో లేరు.. అందుకే హైదరాబాదులో జరిగే ఫార్ములా-ఇ రేసింగ్ కు రావడంలేదు అంటూ చెప్పింది.

Lakshmi Pranathi, Brahmani, Namratha at Formula E race:

Formula E race in Hyderabad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ