నందనమూరి ఫ్యామిలీకి ఏమైంది.. ఆ కుటుంబంలో ఈ విపత్తులేమిటి.. అక్కడ తారకరత్న ఆరోగ్యం ఇంకా కుదపడలేదు, ఆయన కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియక నందమూరి అభిమానులు ఇంకా ఆందోళనతోనే ఉన్నారు. ఈలోపు నందమూరి బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ తృటిలో పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. నందనమూరి రామకృష్ణ ప్రయాణిస్తున్న కారుకి హైదరాబాద్ లో యాక్సిడెంట్ అయ్యింది. శుక్రవారం నందమూరి రామకృష్ణ ప్రయాణిస్తున్న కారుకి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో యాక్సిడెంట్ కి గురయ్యి కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయ్యింది.
రామకృష్ణ నిన్న ఉదయం కారులో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 మీదుగా వెళుతున్న సమయంలో కారు డివైడర్ ని ఢీ కొట్టడంతో కారు ముందు భాగంగా నుజ్జు నుజ్జు అవ్వగా.. రామకృష్ణకి మాత్రం ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు అవలేదని తెలుస్తుంది. ప్రమాదం తర్వాత కారుని అక్కడే వదిలేసి రామకృష్ణ ఇంటికెళ్ళిపోగా.. తర్వాత కుటుంబ సభ్యులు వచ్చి కారుని తీసుకువెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే కారు యాక్సిడెంట్ కి గురైనప్పుడు రామకృష్ణ కారులో ఉండడంతో పోలీస్ లు కూడా ఈ యాక్సిడెంట్ పై కేసు నమోదు చెయ్యలేదని తెలుస్తుంది.
ఈ ప్రమాదం నుండి బయటపడిన రామకృష్ణ ని చూసి నందమూరి అభిమానువులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అటు తారకరత్న కూడా కోలుకోవాలంటూ వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.