జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా కొనసాగుతున్న రామ్ ప్రసాద్ మొన్నామధ్యన ఆసుపత్రిలో తలకి సర్జికల్ క్యాప్ పెట్టుకుని థంబ్ చూపిస్తూ తన ఫ్రెండ్స్ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులతో ఉన్న పిక్ ని షేర్ చేసాడు. అయితే జబర్దస్త్ రామ్ ప్రసాద్ కి ఏదో ఆపరేషన్ జరిగింది అందుకే ఆసుపత్రిలో ఉన్నాడంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ వరసగా జబర్దస్త్ ఎపిసోడ్స్ లో రామ్ ప్రసాద్ కనిపిస్తూనే ఉన్నాడు. అయితే రామ్ ప్రసాద్ నెత్తి మీద హెయిర్ కూడా లేకపోవడం, ఆసుపత్రి పిక్ చూసిన వారు రామ్ ప్రసాద్ కి క్యాన్సర్ అందుకే రామ్ ప్రసాద్ కొన్నాళ్ళు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా రామ్ ప్రసాద్ ఆరోగ్యంపై ప్రచారం జరుగుతుంది.
అయితే తాజాగా రామ్ ప్రసాద్ కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హోటల్ ఓపెనింగ్ కి వచ్చాడు. అక్కడ మీడియా వారు మీకు క్యాన్సర్ అంటున్నారు.. నిజంగానే మీరు క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అని అడగగానే.. నాకు క్యాన్సర్ అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు, నేను తలకి సర్జికల్ క్యాప్ పెట్టుకోవడంతో అందరూ నాకు ఏదో అయ్యింది, అందుకే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అనుకుంటున్నారు. నేను హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాను, అందుకే అలా అంటూ అసలు విషయం చెప్పడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
లేదంటే జబర్దస్త్ లో ఆటో పంచ్ లతో ఆకట్టుకునే రామ్ ప్రసాద్ క్యాన్సర్ బారిన పడ్డాడేమో అని, అతను త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్థిస్తూ ఆందోళనపడ్డారు. ఇప్పుడు రామ్ ప్రసాద్ తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు అలా ఫుల్ స్టాప్ పెట్టేసరికి వారు కుదుటపడ్డారు.