నందమూరి తారకరత్న బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో క్రమంగా కోలుకుంటున్నట్టుగా హీరో కళ్యాణ్ రామ్ రీసెంట్ గా అమిగోస్ ప్రెస్ మీట్ లో మాట్లాడంతో తారకరత్న ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన కాస్త తగ్గింది. నిన్నమొన్నటివరకు తారకరత్న ఆరోగ్యంపై రకరకాల వదంతులు వ్యాప్తి చెందాయి. మొన్న కూడా కళ్యాణ్ రామ్ డాక్టర్స్ ఏమి చెబుతున్నారో అదే నాకు తెలుసు అని అనుమానం మొలకెత్తేలా మాట్లాడడంతో అందరిలో ఆందోళన కలిగింది.
కానీ తాజాగా జరిగిన అమిగోస్ ప్రెస్ మీట్ లో తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతుంది, ప్రస్తుతం తారకరత్న కోలుకుంటున్నాడు, అయితే ప్రెజెంట్ తారకరత్న కండిషన్ ఎలా ఉన్నదో అనేది డాక్టర్స్ మాత్రమే చెప్పగలరు, ఆ విషయాలన్నీ ఆసుపత్రి వర్గాలు చెబితే బావుంటుంది. మేమంతా తారకరత్న త్వరగా కోలుకుని మాములుగా అవ్వాలని కోరుకుంటున్నాము, అందుకు మీ ఆశీర్వాదాలు కావాలి, మీ అందరి ఆశీర్వచనాలతో త్వరగా కోలుకోవాలని కోరుకుందాము అంటూ కళ్యాణ్ రామ్ మరోసారి తారకరత్న హెల్త్ పై మాట్లాడారు.
కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.