కిర్రాక్ ఆర్పీ ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ తో మీడియాలో సంచలనంగా మారాడు. జబర్దస్త్ టాగ్ ఆల్మోస్ట్ ఆర్పీ చేపల పులుసు సక్సెస్ అవడంతో వదిలించుకున్నట్టే కనబడుతుంది. కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ సూపర్ సక్సెస్ అవడంతో మణికొండ లో మరో బ్రాంచ్ ఓపెన్ చేసాడు. మరి కూకట్ పల్లి బ్రాంచ్ కి కష్టమర్స్ కన్నా ఎక్కువగా యూట్యూబ్ ఛానల్స్ ఆర్పీ చుట్టూ తిరిగాయి. దానితో ఆ కర్రీ పాయింట్ కేవలం రెండు రోజుల్లో ఫెమస్ అయ్యింది. ఆ కర్రీ పాయింట్ పెట్టిన రెండు నెలలకే మాదాపూర్ లో రీసెంట్ గా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసాడు ఆర్పీ.
ఈ కర్రీ పాయింట్ కి ఓపెనింగ్ కి వచ్చిన హైపర్ ఆది ఆర్పీ చేపల పులుసుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. ఆర్పీ అన్న జబర్దస్త్ లో ఉండగానే అప్పుడప్పుడు చేపల పులుసు తో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తా అనేవాడు, ఇప్పుడు చేసాడు, ఆర్పీ అన్నది నెల్లూరు, కర్రీ పాయింట్ పేరు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు, అలాగే నెల్లూరు చేపల పులుసుకి బాగా పేరు. సో అన్ని అలా కలిసొచ్చాయి. ఇక ఆర్పీ చేపల పులుసు కాస్ట్లీ అంటున్నారని యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆది పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు.
చేపల పులుసు క్వాలిటీ బావుంది, టేస్ట్ బావుంది.. ఈ టేస్ట్ సిటీలో ఎక్కడా దొరకడం లేదు, సో ఆ రుచి కోసం ఆ రేటు పెట్టినా తప్పు లేదు, పెద్ద పెద్ద హోటల్స్ లో అంతకన్నా ఎక్కువే పెట్టి కొంటాము కానీ ఇంత టేస్ట్ అయితే ఉండదు, ఆర్పీ చేపల పులుసు రుచి చూసారా అని అడిగిన యాంకర్ తో చూసాను, చాలా బావుంది. ఒక చోట చేపల పులుసు పాయింట్ పెట్టి రెండు నెలల్లో మరో బ్రాంచ్ ఓపెనింగ్ అంటే మాములు విషయం కాదు, అది ఆర్పీ అన్నకే సాధ్యమైంది అంటూ హైపర్ ఆది ఆర్పీ చేపల పులుసుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.