Advertisementt

ట్రోల్స్ పై బాధపడేదాన్ని: జాన్వీ కపూర్

Thu 09th Feb 2023 09:02 PM
janhvi kapoor  ట్రోల్స్ పై బాధపడేదాన్ని: జాన్వీ కపూర్
I hate trolls: Janhvi Kapoor ట్రోల్స్ పై బాధపడేదాన్ని: జాన్వీ కపూర్
Advertisement
Ads by CJ

జాన్వీ కపూర్ వెండితెర మీద ఎంతగా సక్సెస్ అవుదామని పోరాడుతున్నా ఆమెకి అక్కడ సక్సెస్ మాత్రం అందని ద్రాక్షలా తయారైంది. శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ సినిమా విడుదలైనప్పుడల్లా ఆమె పెరఫార్మెన్స్ బాగోలేదు, ఆమె శ్రీదేవి డాటర్ గానే కనిపిస్తుంది, ఆమె గ్లామర్ ని నమ్ముకుంది తప్ప నటన మీద కాన్సంట్రేట్ చెయ్యడం లేదు అంటూ జాన్వీ కపూర్ తరుచూ ట్రోలింగ్ కి, విమర్శలకి గురవుతుంది. తాజాగా ఆమెపై వచ్చే విమర్శలు, ట్రోలింగ్ పై చాలా బాధపడుతున్నట్టుగా చెప్పింది.

తనేం చేసినా నెటిజెన్స్ కి తప్పే, నడిచినా శ్రీదేవి కూతురే అంటారు, కూర్చున్నా శ్రీదేవి కుమర్తె అంటారు. నువ్వు స్టార్ కిడ్ వి అంటూ నేపోటీజాన్ని బయటికి తీస్తారు. ఈ విమర్శలతో విసిగిపోయాను, మనము ఏం చేసినా తప్పే, ఎంత కష్టపడినా పట్టించుకోరు, అందులో తప్పులు వెతుకుతారు. మనం ఎంత బాధపడినా అందులో వాళ్ళ సంతోషాన్ని వెతుక్కుంటారు తప్ప మన బాధని అర్ధమే చేసుకోరు. మనపై చేసే కామెంట్స్ తో వారు వార్తల్లోకి వస్తారు. సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా స్టార్ కిడ్, నటన రానప్పుడు సినిమాలు మానెయ్యొచ్చు కదా అంటూ విమర్శిస్తారు. అవి చూసినప్పుడు చాలా బాధపడేదానిని.

కానీ ఇప్పుడు ఆ విమర్శలు చూస్తే బాధ కాదు, నవ్వొస్తుంది, నా బాలలు, బలహీనతలు, నేను ఎలా నటిస్తున్నానో నాకు తెలుసు, ఎవరో ఏదో అన్నారని పట్టించుకోను, వాళ్ళ విమర్శలు మంచివైతే ఓకె.. కానీ నన్ను కించపరిచేలా ఉంటే నేను అస్సలు పట్టించుకోను, నేను ఇప్పటివరకు చేసిన సినిమాలతో నటిగా నన్ను నేను నిరూపించుకున్నాను అనుకుంటున్నాను, సో నాకు అవకాశాలు వస్తాయనిపిస్తుంది అంటూ జాన్వీ కపూర్ తనపై వచ్చే విమర్శలు, ట్రోల్స్ పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

I hate trolls: Janhvi Kapoor:

Janhvi Kapoor reacts to TROLLS calling her nepotism ki bachchi

Tags:   JANHVI KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ