Advertisementt

ఆహా కి ఇది చాలు

Thu 09th Feb 2023 07:58 PM
balakrishna,pawan kalyan,unstoppable  ఆహా కి ఇది చాలు
Balakrishna-Pawan Kalyan unstoppable episode news ఆహా కి ఇది చాలు
Advertisement
Ads by CJ

ఆహా ఓటిటి పెట్టాక ఏ సినిమాకి, ఏ షో కి ఎంతమంది సబ్ స్క్రైబర్స్ పెరిగారో తెలియదు కానీ.. నందమూరి నటసింహ బాలకృష్ణ తో అన్ స్టాపబుల్ టాక్ షో స్టార్ట్ చేసాక ఆహా కి పొలోమంటూ సబ్ స్క్రైబర్స్ వచ్చేసారు. మొదటి సీజన్ లో పొలిటికల్ గా వ్యూయర్స్ లేకపోయినా.. సెకండ్ సీజన్ వచ్చేసరికి పొలిటికల్ టచ్ కూడా ఇవ్వడంతో పొలిటికల్ వ్యూయర్స్ కూడా ఆహా కి వచ్చేసారు. దానితో సబ్ స్క్రైబర్స్ సంఖ్య పెరిగింది. ఇక ప్రభాస్ ఎపిసోడ్స్ ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం అంతే ఆత్రంగా ఉన్నారు ఆడియన్స్.

ఇప్పటికే బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఎపిసోడ్ పై విపరీతమైన అంచనాలు ఏర్పడగా.. ఆ ఎపిసోడ్ ఆ అంచనాలు అందుకుంది. ఇక ఈరోజు రాబోతున్న రెండో ఎపిసోడ్ పై రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్ పై ఆసక్తికర విషయాలను పంచుకొంటున్నారు. బాలయ్య అడిగే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు, పవన్ కళ్యాణ్ అంతే ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇవ్వబోతున్నారు.

అందుకే ఈ ఎపిసోడ్ కోసం రెండు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా, క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఈక్రేజ్, ఈ అంచనాలు ఆహా కి సరిపోతాయి. ఇప్పటివరకు ఒక ఎత్తు.. పవన్ కళ్యాణ్ సెకండ్ ఎపిసోడ్ తో మరో ఎత్తు అన్నట్టు ఉంది ప్రస్తుతం ఆహా కి క్రేజ్. మరికాసేపట్లో పవన్ కళ్యాణ్-బాలకృష్ణ సెకండ్ ఎపిసోడ్ వచ్చేస్తుంది.

Balakrishna-Pawan Kalyan unstoppable episode news:

Aha unstoppable show update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ