ప్రభాస్-కృతి సనన్ వచ్చే వారం మాల్దీవుల్లో రహస్యంగా నిశ్చితార్ధం చేసుకోబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది. ఉమర్ సందు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది, బాలీవుడ్ మీడియా నుండి టాలీవుడ్ మీడియా వరకు ప్రభాస్-కృతి సనన్ ఎంగేజ్మెంట్ న్యూస్ ని వైరల్ చెయ్యడంతో అందరూ ప్రభాస్ నిజంగానే కృతి సనన్ తో డేటింగ్ లో ఉన్నాడనే అపోహల్లోకి వెళ్లిపోయారు.
దానితో ప్రభాస్ పీఆర్ టీమ్ రంగంలోకి దిగి.. జరిగిన డ్యామేజ్ ని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రభాస్-కృతి సనన్ లు మంచి ఫ్రెండ్స్, కో స్టార్స్ మాత్రమే. ఇంతకుమించి వారి మధ్యన ఇంకెలాంటి బంధం లేదు, అసలు వాళ్ళకి నిశ్చితార్ధం జరుగుతుంది అనే గాసిప్ మత్రమే అంటూ ప్రెస్ నోట్స్ ఇచ్చి వాటిని వైరల్ చేయిస్తున్నారు. ఆదిపురుష్ సినిమా సెట్స్ లోనే కృతి సనన్-ప్రభాస్ మధ్యలో సం థింగ్ సం థింగ్ అంటూ న్యూస్ లు మొదలై.. ఇదిగో ఈ ఎంగేజ్మెంట్ రూమర్ వరకు వచ్చి ఆగింది.
అది రూమర్ అని తెలిసినా కొద్దిమంది మీడియా మేధావులు దానిని ప్రముఖంగా ప్రసారం చెయ్యడంపై ప్రభాస్ ఫాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. మరి ప్రభాస్ పీఆర్ టీమ్ చెప్పింది విని ఇప్పటికైనా ఈ రూమర్స్ ని ఆపుతారో.. లేదంటే మారేదన్నా కొత్తది పుట్టిస్తారో చూద్దాం.