మహేష్ బాబు ఇప్పుడిప్పుడే కుదుటపడి త్రివిక్రమ్ SSMB28 షూటింగ్ లో పాల్గొంటున్నారు. గత కొద్దిరోజులుగా మహేష్ ఉదయం, సాయంత్రం అనేది లేకుండా షూటింగ్ కి హాజరవుతున్నారు. ఎంత త్వరగా త్రివిక్రమ్ షూటింగ్ ముగించేసి అంత త్వరగా రాజమౌళి సెట్స్ లోకి వెళ్లాలనేది ఆయన ప్లాన్, అందుకే ఉదయం షార్ప్ గా 6 గంటలకే షూటింగ్ బయలు దేరి వెళుతున్నారు. అయితే గత ఏడాది ఎప్పుడో అనౌన్సమెంట్ వచ్చిన SSMB28 సెట్స్ మీదకి వెళ్లడానికి ఆరు నెలల సమయం తీసుకుంటే.. మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక తదుపరి షెడ్యూల్ కి మరో నాలుగు నెలలు సమయం తీసుకోవడంతో మహేష్ ఫాన్స్ బాగా డిస్పాయింట్ అవుతున్నారు.
మధ్యలో మహేష్ వ్యక్తిగత కారణాలతో షూటింగ్ బాగా లేట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో SSMB28 చిత్రీకరణను ఉంది. అయితే ఈ షెడ్యూల్ ని కంప్లీట్ చేసేసిన మహేష్ ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో ఫాన్స్ ఆందోళన పడుతున్నారు. ఇప్పుడే ట్రాక్ లోకి వచ్చిన SSMB28 షూటింగ్ కి మళ్ళీ ఎక్కడ బ్రేకులు పడతాయో అని వాళ్ళ బాధ. అయితే మహేష్ తన భార్య నమ్రతతో కలిసి వెకేషన్స్ కి వెళుతున్నట్లుగా తెలుస్తుంది. మహేష్ అండ్ నమ్రతలు ఇప్పుడు ఇంత సడన్ గా వెకేషన్స్ ఎందుకు ప్లాన్ చేసుకున్నారంటే.. ఫిబ్రవరి 10వ తేదీన నమ్రత, మహేష్ బాబు మ్యారేజ్ యానివర్సరీ.
అంతేకాకుండా మరో నాలుగు రోజుల్లో వాలెంటైన్స్ డే కూడా ఉండడంతో వీరు స్పెయిన్ కి వెళుతున్నటుగా తెలుస్తుంది. మహేష్ ఎయిర్ పోర్ట్ లో తలకి కాప్ పెట్టుకుని కొత్తగా కనిపించారు. స్పెయిన్ నుండి రాగానే మళ్ళీ మహేష్ SSMB28 తదుపరి షెడ్యూల్ షూట్ లో బిజీ అవుతారని తెలుస్తుంది.