పవన్ కళ్యాణ్ ఫాన్స్ ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. ఇటు పవన్ ఫాన్స్ అటు జనసైనికులు కూడా అదే మూడ్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆయన రాజకీయాల్లో తన మార్క్ చూపిస్తున్నారు. వచ్చే ఎలక్షన్స్ టైమ్ కల్లా పవన్ కళ్యాణ్ ఇదే స్పీడుని కంటిన్యూ చేస్తే గనక జనసేన 2024 ఎన్నికల్లో తమ ప్రతాపం చూపిస్తుంది. మళ్ళీ సినిమాలు అంటూ పవన్ కళ్యాణ్ రాజకీయాలకి బ్రేక్ ఇస్తే.. ఆ ఫ్లో మిస్ అవుతుంది అనేది జనసైనికుల బాధ.
ఇప్పుడే పాలిటిక్స్ లో పవర్ ఫుల్ స్పీచ్ లతో ప్రతి పక్షం గుండెల్లో ఒణుకు పుట్టిస్తున్న పవన్ కళ్యాణ్ ఇలానే ఉండాలని వారు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసేసి.. వేరే సినిమాలను కాస్త పక్కనబెడితే బావుంటుంది అంటున్నారు. కానీ డిసెంబర్ లో హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు. అది రేపో మాపో రెగ్యులర్ షూట్ కి వెళుతుందని తెలుస్తుంది.
ఇక జనవరి చివరిలో సుజిత్-దానయ్య ఫిల్మ్ ని పూజా తో మొదలు పెట్టారు. ఇప్పుడు మరో సినిమా కూడా మొదలు పెట్టబోతున్నారనే న్యూస్ తో అటు జన సైనికులు వర్రీ అవుతున్నారు. ఇటు పవన్ ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నా.. ఈ సినిమాలన్నీ పవన్ ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియక ఆందోళనలోకి వెళుతున్నారు. మరి పవన్ పూర్తిస్థాయి రాజకీయాలు చెయ్యాలని జనసేన ఫాన్స్ అడుగుతుంటే.. పవన్ ఫాన్స్ మాత్రం సినిమాలు, రాజకీయాలు రెండూ చూసుకోమని సలహాలు ఇస్తున్నారు.