Advertisementt

ఆమె కోసం బిగ్ బాస్ యాజమాన్యం ఆరాటం

Thu 09th Feb 2023 09:49 AM
rashmi,bigg boss telugu 7  ఆమె కోసం బిగ్ బాస్ యాజమాన్యం ఆరాటం
Rashmi Gautam to Take part in Bigg Boss Telugu 7? ఆమె కోసం బిగ్ బాస్ యాజమాన్యం ఆరాటం
Advertisement
Ads by CJ

ఈటివి జబర్దస్త్ ద్వారా బాగా ఫెమస్ అయ్యి వెండితెర మీద హీరోయిన్ గా అదృష్టాన్ని పరీక్షించుకున్న రష్మీ గౌతమ్.. కొన్ని సీజన్స్ కి ఢీ డాన్స్ షోకి కూడా మెంటర్ గా యాంకర్ గా వ్యవహరించింది. చిట్టిపొట్టి డ్రెస్సులతో రష్మీ స్టైలిష్ గా కనబడుతుంది. నాజూగ్గా, గ్లామర్ గా కనిపించే రష్మీ కి తెలుగు అంతగా రాకపోయినా కూడా తన అందాలతో ఎలాగోలా మేనేజ్ చేస్తుంది. బుల్లితెర కమెడియన్ సుధీర్ తో లవ్ ట్రాక్ అంటూ ఫెమస్ అయ్యింది. రష్మీ-సుధీర్ పెళ్లి కూడా చేసుకుంటారనే టాక్ నడిచింది. అయితే అదేమీ లేదు కేవలం ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కోసమే కానీ.. ఆఫ్ స్క్రీన్ మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతారు.

అయితే ఇప్పుడు ఈ హాట్ యాంకర్ కోసం బిగ్ బాస్ యాజమాన్యం తహతహలాడుతోంది. ఈ ఏడో సీజన్ కి ఎలాగైనా రష్మిని తీసుకురావాలని చూస్తున్నారట. ఆమెకి పారితోషకం పరంగా అందరి కన్నా ఎక్కువ మొత్తం ఆఫర్ చెయ్యడమే కాకుండా ఆమె కండిషన్స్ ని కూడా బిగ్ బాస్ యాజమాన్యం ఒప్పుకోవడానికి రెడీ అయ్యింది అనే టాక్ వినబడుతుంది. రష్మీ వస్తే ఈ సీజన్ కి కాస్త హైప్ క్రియేట్ అవుతుంది.. ఆమె గ్లామర్, అలాగే ఆమె క్రేజ్ ఈ సీజన్ పై అంచనాలు పెరిగేలా చేస్తుంది.. ఇప్పటికే బిగ్ బాస్ అంటే బుల్లితెర ప్రేక్షకులు బోర్ ఫీలవుతున్నారు అని.. అందుకే రష్మిని ఎలాగైనా తీసుకురావాలనే ప్రయత్నాల్లో బిగ్ బాస్ యాజమాన్యం ఉన్నట్లుగా తెలుస్తుంది.

మరి జబర్దస్త్, ఇంకా బుల్లితెర షోస్, అలాగే ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ అంటూ బిజీగా వుండే రష్మీ నిజంగా బిగ్ బాస్ కి వస్తుందా? వస్తే ఈ సీజన్ కి గ్యారెంటీగా క్రేజ్ రావడం పక్కా.

Rashmi Gautam to Take part in Bigg Boss Telugu 7?:

Rashmi is entering Bigg Boss Telugu 7

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ