Advertisementt

సర్ప్రైజ్: చిరుతో చరణ్ డాన్స్

Wed 08th Feb 2023 09:52 PM
ram charan,chiranjeevi,bholaa shankar  సర్ప్రైజ్: చిరుతో చరణ్ డాన్స్
Charan Shaking Leg With Chiranjeevi In Bholaa Shankar సర్ప్రైజ్: చిరుతో చరణ్ డాన్స్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవితో రామ్ చరణ్ గత ఏడాది ఆచార్యలో నటించాడు. చిరు-చరణ్ కలిసి సినిమా చేస్తున్నారు అంటే ఆ అంచనాలు మాములుగా ఉండవు. గతంలో ఖైదీ నెంబర్ 150 లో చిరు తో కలిసి రామ్ చరణ్ డాన్స్ చేసి రచ్చ చేసాడు, కానీ కలిసి నటించిన ఆచార్య మాత్రం మెగా ఫాన్స్ అంచనాలు అందుకోలేకపోయింది. గత ఏడాది ఆర్.ఆర్.ఆర్ అలాగే ఆచార్య తో ఆడియన్స్ ముందుకు వచ్చిన రామ్ చరణ్ ఈ ఏడాది మాత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే స్కోప్ లేదు. ఎందుకంటే రామ్ చరణ్ RC15 ఈ ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. దిల్ రాజు-శంకర్ RC15 ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు.

అయితే ఇప్పుడు రామ్ చరణ్ మరోసారి చిరు సినిమాలో కనిపించబోతున్నాడు. అది కూడా భోళా శంకర్ లో చరణ్ ఓ సాంగ్ లో చిరు తో కలిసి కాలు కదపబోతున్నాడట. చిరంజీవి-మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కుతున్న భోళా శనకర్ సాంగ్ షూట్ హైదరాబాద్ లో జరుగుతున్నట్టుగా, చిరు 200 మంది డాన్సర్స్ తో స్టెప్స్ వెయ్యబోతున్నట్టుగా మేకర్స్ ఈ బుధవారం అప్ డేట్ ఇచ్చారు. ఈ సాంగ్ లో రామ్ చరణ్ కూడా చిరు తో స్టెప్స్ వేస్తాడని సన్నిహిత వర్గాల సమాచారం మేరకు అందుతున్న వార్త.

అంటే చిరు-చరణ్ ఒకే సాంగ్ లో స్టెప్స్ వేస్తె మెగా ఫాన్స్ కి కిక్కే. ఈ ఏడాది రామ్ చరణ్ మూవీ తో ఆడియన్స్ ముందుకు రాకపోయినా.. ఇలా చిరు భోళా శంకర్ తో ప్రేక్షకులకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడన్నమాట. ఇక ఈ సాంగ్ లోనే చిరుకి సిస్టర్ కేరెక్టర్ లో నటిస్తున్న కీర్తి సురేష్ కూడా పాల్గొనబోతుంది.

Charan Shaking Leg With Chiranjeevi In Bholaa Shankar:

Ram Charan Shaking Leg With Chiranjeevi In Bholaa Shankar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ