తెలుగు దేశమైనా, బీజేపీ అయినా, లేదంటే జనసేన అయినా.. ఈ మూడు పార్టీలు ఏం చేసినా.. ఆఖరికి మంచి చేసినా వైసీపీ కి, ప్రభుత్వానికి అనుకూల ఛానల్, జగన్ ఓన్ ఛానల్ సాక్షి మాత్రం వాళ్ళని వేలెత్తి చూపుతూ.. జగన్ ని పైకి ఎత్తుతూ.. వైసిపీ ప్రభుత్వం ఆహా, ఓహో.. అంటూ భజన చెయ్యడం అందరికి తెలిసిందే. చంద్రబాబు అలా, పవన్ ఇలా ప్రజలని మోసం చేస్తారంటూ వాళ్లపై విరుచుకుపడిపోతూ.. వాళ్ళేం తప్పు చేస్తారా అంటూ కాచుకుని కూర్చుంటుంది. అయితే ఇప్పుడు అలాంటి సాక్షి కూడా లోకేష్ పాదయాత్ర విషయంలో కాస్త బెటర్ అనేలా టీడీపీ కార్యకర్తలు ఫీలవుతున్నారు. ఎందుకంటే వైసిపికి అనుకూల వెబ్ సైట్స్ లోకేష్ పాదయాత్ర విషయంలో ఏడవలేక ఏడుస్తున్నాయి.
లోకేష్ యువగళం పాదయాత్ర మొదలై ఇప్పటికి 13 రోజులైంది. ఈ పదమూడు రోజులుగా లోకేష్ పాదయాత్ర పై పడి ఏడవడం చూస్తే వాళ్ళకి లోకేష్ అంటే భయం పట్టుకుంది అనిపించకమానదు. ఎందుకంటే లోకేష్ కి వస్తున్న ప్రజాదరణ, ఆయన పాదయత్రకి వస్తున్న రెస్పాన్స్ చూసి అప్పుడే వైసిపీ అనుకూల వెబ్ సైట్స్ లోకేష్ కి వ్యతిరేఖంగా వార్తలు ప్రచారం చేస్తున్నాయి. లోకేష్ నడవలేకపోతున్నాడు, లోకేష్ పాదయాత్ర చూస్తే టీడీపీ కార్యకర్తలకే నీరసం వస్తుంది. లోకేష్ పాదయాత్ర డిసాస్టర్ అబ్బో ఇలాంటి క్యాప్షన్స్ పెట్టి మరీ ఏడుపు స్టార్ట్ చేసాయి.
లోకేష్ పాదయాత్ర ఎక్కడ సక్సెస్ అవుతుందో అని వాళ్ళు ఇంతలా కంగారు పడిపోయి నెగెటివ్ న్యూస్ లు స్ప్రెడ్ చేస్తున్నాయి. లోకేష్ పాదయాత్ర విషయంలో సాక్షి టీవీ కూడా ఇన్ని కథనాలు ప్రసారం చేసి కిందా మీదా పడలేదేమో.. కానీ వైసీపీ అనుకూల వెబ్ సైట్స్ మాత్రం లోకేష్ పాదయాత్ర కొస్తున్న రెస్పాన్స్ చూసి ఎలాగైనా నెగెటివ్ పబ్లిసిటీ ఇచ్చి ఎంతోకొంత డ్యామేజ్ చెయ్యాలని చూసినా.. లోకేష్ కి ఎక్కడికెళ్లినా జననీరాజనాలు అందుతున్నాయి.
సో ఎవ్వరు ఎంత ఏడ్చినా లోకేష్ పాదయాత్ర మాత్రం సక్సెస్ అవడం పక్కా అంటూ తెలుగు తమ్ముళ్లు కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు.