Advertisementt

త్రివిక్రమ్ స్కెచ్ మాములుగా ఉండదు

Wed 08th Feb 2023 07:53 PM
mahesh babu,ssmb28  త్రివిక్రమ్ స్కెచ్ మాములుగా ఉండదు
Interesting news on SSMB28 త్రివిక్రమ్ స్కెచ్ మాములుగా ఉండదు
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ అంటే కాస్ట్లీ కథలు, దానికి తగ్గ స్టార్ హీరోలు, స్టార్స్ హీరోయిన్స్ తోనే సినిమా చేస్తారు. మొదటి నుండి స్టార్ హీరోలకి సరిపోయే డబ్బుతో కూడిన కథలనే ఆయన ఫాలో అవుతారు. వేరే సినిమాలని కాపీ కొట్టినా, లేదంటే రీమేక్ చేసినా చాలా అఫీషియల్ గా ఉంటారు. ఇక ఆయన మొదటి సినిమా నుండి చూస్తే అతడు, జల్సా, ఖలేజా, సన్ ఆఫ్ సత్యమూర్తి, జులాయి, అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురములో, అ.. ఆ ఇవన్నీ దాదాపుగా డబ్బు చుట్టూ తిరిగిన కథలే కావడం గమనార్హం.

తాజాగా మహేష్ తోనూ అలాంటి సినిమానే త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో SSMB28 షూటింగ్ హైదరాబాద్ లోనే జరుపుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ఓ త్రివిక్రమ్ ఓ భారీ ఇంటి సెట్ వేయిస్తున్నారట. ఇప్పటికే సారధి స్టూడియో లో వేసిన ఓల్డ్ మోడల్ విలేజ్ బ్యాగ్డ్రాప్ లో ఉండే  డాబా సెట్ లో మొదటి షెడ్యూల్ ముగిసింది. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ కోసం త్రివిక్రమ్ హైదరాబాద్ ఔట్స్ కట్స్ లో ఓ భారీ ఇంటి సెట్ ని నిర్మిస్తున్నారట.

ఆ ఇంటి సెట్ ఖరీదు అక్షరాలా 10 కోట్లు విలువ ఉంటుందట. మరి సెట్ ఇంటి కోసమే పది కోట్ల ఖర్చా అంటూ నెటిజెన్స్, మహేష్ బాబు ఫాన్స్ ఆశ్చర్యపోతుంటే.. అందుకే అనేది త్రివిక్రమ్ స్కెచ్ మాములుగా ఉండదు అని అంటున్నారు ఆయన ఫాన్స్. ఈ ఇంటి సెట్ ఇంతవరకు టాలీవుడ్ లోనే నిర్మించని విధంగా భారీగా, కొత్తగా ఉండబోతుందట. 

Interesting news on SSMB28 :

 SSMB28 shooting update 

Tags:   MAHESH BABU, SSMB28
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ