Advertisementt

ముంబైకి షిప్ట్ అవుతున్న సమంత?

Wed 08th Feb 2023 06:25 PM
samantha,mumbai,hyderabad  ముంబైకి షిప్ట్ అవుతున్న సమంత?
Samantha shifting to Mumbai? ముంబైకి షిప్ట్ అవుతున్న సమంత?
Advertisement
Ads by CJ

నాగ చైతన్య తో విడిపోయాక సమంత కొద్దిరోజులు తల్లితండ్రుల చెంత ఉన్నప్పటికీ.. తర్వాత నాగ చైతన్యతో కలిసి కాపురం ఉన్న ఇంటిని పాత ఓనర్ తో మాట్లాడి మళ్ళీ తీసుకుంది. తర్వాత మాయోసైటిస్ తో ఇబ్బంది పడిన సమంత చాలారోజులుగా బయట ముఖమే చూడలేదు. ఇప్పుడు ముంబై టు హైదరాబాద్ అన్నట్టుగా ఉంది ఆమె జర్నీ. ఎందుకంటే ముంబై లో వరుణ్ ధావన్ తో కలిసి రాజ్ అండ్ DK దర్శకత్వంలో సిటాడెల్ వెబ్ సీరీస్ లో నటిస్తుంది. ఇక్కడ తెలుగులో విజయ్ దేవరకొండ ఖుషి షూటింగ్ చెయ్యాల్సి ఉంది.

అయితే కొద్దిరోజుల క్రితం సమంత హైదరాబాద్ నగర శివార్లలో ఓ ఇల్లు కొనుగోలు చేసింది అన్నారు. కానీ ఇప్పుడు సమంత అస్తమాను ముంబై కి తిరగాలి అక్కడ హోటల్ రూమ్స్ లో ఏం ఉంటాములే అని.. ముంబైలోని ఓ ఇంటిని కొనుగోలు చేసేందుకు చూస్తుందట. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ టైమ్ లోనే సమంత అక్కడ ఇల్లు కొని ముంబై కి షిఫ్ట్ అవుతుంది అన్నారు. ఆ విషయమై నాగ చైతన్య తో గొడవయ్యింది అందుకే విడాకులకు దారితీసింది అంటూ ప్రచారము జరిగింది. ఇప్పుడు మాత్రం ఓ 15 నుండి 17 కోట్ల మధ్యలో ముంబై లో కొత్త ఇంటిని కొనుగోలు చేసునేందుకు సమంత నిర్ణయం తీసుకుందట.

అయితే సమంత ఏ ఏరియా లో ఇల్లు కొనేందుకు చూస్తుందో.. అసలు ఆమె నిజంగానే ముంబైలో ఇల్లు కొంటుందా అనేది మాత్రం సమంత స్పందిస్తేనే కానీ తెలియదు. ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే ఆమె నటించిన శాకుంతలం విడుదల పోస్ట్ పోన్ అవ్వగా కొత్త డేట్ ఇంకా ప్రకటించలేదు.

Samantha shifting to Mumbai?:

Samantha shifts to Mumbai, moves out of her Hyderabad home?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ