జబర్దస్త్ నుండి బయటికొచ్చాక చాలా ఛానల్స్ తిరిగి తిరిగి ఇప్పుడు చేపల పులుసు కర్రీ పాయింట్ పెట్టి ఫెమస్ అయిన కిర్రాక్ ఆర్పీ తన నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు గురించి గొప్పగా మాట్లాడడమే కాదు, తన చేపల పులుసు పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ కొంతమందిపై దుమ్మెత్తిపోస్తున్నాడు. కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓపెన్ చేసింది మొదలు యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూకట్ పల్లి ఏరియాలోనే కనిపించాయి. అంత త్వరగా ఆర్పీ చేపల పులుసు ఫెమస్ అవడానికి కారణం అవే. ఆర్పీ కూడా నా చేపల పులుసు అలా, ఇలా అంటూ వంట చేస్తున్న వీడియోస్ కూడా ఇవ్వడంతో.. పెద్దారెడ్డి చేపల పులుసుకి జనాలు ఎగబడ్డారు.
అయితే జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ని ఆర్పీ చేపల పులుసు గురించి అడగ్గానే అదంతా జబర్దస్త్ పెట్టిన పుణ్యమే, బిక్షే అంటూ సంచలనంగా మాట్లాడాడు. కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ పై నెగెటివ్ కామెంట్స్ చేసినప్పటి నుండి జబర్దస్త్ బ్యాచ్ మొత్తం ఆర్పీపై కత్తి కట్టారు. ఇప్పుడు రాకింగ్ రాకేష్ ని ఆర్పీ చేపల పులుసు ఫెమస్ అవ్వడానికి కారణం జబర్దస్తే అంటారా అనగానే.. ఎవవరికైనా ఆ కామెడీ షో జబర్దస్త్ పెట్టిన బిక్షే అంటూ రాకేష్ కామెంట్స్ చేసాడు.
మీరు ఆర్పీ జబర్దస్త్ వదిలేసాక ఎప్పుడైనా కలిసారా అని అడిగితే.. లేదు అంత పెద్దవాళ్ళని కలిసేంత అదృష్టం మాకు లేదు, మేమేదో చిన్న ఆర్టిస్టులము. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అంటూ రాకింగ్ రాకేష్ కిర్రాక్ ఆర్పీ పై వ్యంగ్యంగా చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి.