అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ద రూల్ షూటింగ్ లో తలమునకలై ఉన్నారు. పుష్ప పార్ట్ 1 ని కూల్ గా తెరకెక్కించి హడావిడిగా ప్రమోషన్స్ కి సమయమే లేకుండా రిలీజ్ చేసేసినట్లుగా కాకుండా.. పుష్ప పార్ట్ 2 ని కూల్ గా తెరకెక్కించి.. ప్రమోషన్స్ తో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసే ప్లాన్ లో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ లు ఉన్నారు. అందుకే గత ఏడాది పుష్ప షూటింగ్ లేకుండా.. ఈ ఏడాది పార్ట్ 2 షూటింగ్ తో బిజీ అయ్యారు. ప్రస్తుతం వైజాగ్ లో ఓ కీలక షెడ్యూల్ ముగించుకుంది పార్ట్ 2. నిన్న మంగళవారమే అల్లు అర్జున్ వైజాగ్ నుండి హైదరాబాద్ కి తిరిగివచ్చారు.
వైజాగ్ లో దాదాపుగా 18 రోజులపాటు పుష్ప షూటింగ్ లో పాల్గొన్న అల్లు అర్జున్ గత రెండు రోజులుగా ఫాన్స్ తో కలిసి ఫోటో షూట్స్ లో పాల్గొన్నారు. ఇక నిన్న హైదరాబాద్ పయనమయ్యే ముందు వైజాగ్ బీచ్ లో అలా నడుస్తున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ పిక్ తో పాటుగా థాంక్యూ వైజాగ్, విశాఖ పట్టణం నాకెప్పటికీ ప్రత్యేకమే అంటూ షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.
ఇక పుష్ప 2 నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే చిత్రీకరిస్తారని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ రష్మిక-విలన్ పాత్రధారి మలయాళం నటుడు ఫహద్ ఫాసిల్ కూడా పాల్గొంటారని సమాచారం.