Advertisementt

కొత్త కమిట్మెంట్స్ లేవు -కళ్యాణ్ రామ్

Wed 08th Feb 2023 11:52 AM
kalyan ram,amigos  కొత్త కమిట్మెంట్స్ లేవు -కళ్యాణ్ రామ్
No new commitments -Kalyan Ram కొత్త కమిట్మెంట్స్ లేవు -కళ్యాణ్ రామ్
Advertisement
Ads by CJ

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ రేపు శుక్రవారం విడుదలకి సిద్దమయ్యింది. బింబిసారా సక్సెస్ తర్వాత రాబోతున్న చిత్రం కాబట్టి అమిగోస్ పై అందరిలో అంచనాలు కనిపిస్తున్నాయి. ఈమధ్యనే కర్నూల్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్, హైదరాబాద్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ గా అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ ప్రమోషన్స్ తో ఆసక్తిని క్రియేట్ చేసిన కళ్యాణ్ రామ్.. తాజాగా మీడియాకి ఇంటర్వూస్ ఇస్తున్నాడు. అమిగోస్ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ ఎన్నో విషయాలను మీడియాతో పంచుకున్నాడు.

బింబిసార సక్సస్ తో అమిగోస్ చేసాను. మనిషిని పోలిన మనుషులు 7గురు వుంటారని చిన్నప్పుడు విన్నాం అదే ఈసినిమాలో కొత్తగా చేసాం. అమిగోస్ టైటిల్ విషయం మట్లాడుతూ.. ఈటైటిల్ ఈ సినిమాకు కరెక్ట్ గానే పెట్టాం. సినిమా కు సంబదం లేకుండా రాంగ్ టైటిల్ పెడితే నేనే బాధ పడతా. బింబిసార కు ముందు ఓకే చేసిన సినిమాలే చేస్తున్నాను.. కొత్త సినిమాలేవీ ఇంకా ఒప్పుకోలేదు. 

అయితే నేను కెరీర్ లో చాలా ప్లాప్స్ తో ఇబ్బంది పడ్డాను, అసలు నేను చేసిన ప్లాప్ సినిమాలు ఎందుకు అయ్యాయి అనే దానిపై కోవిడ్ లో రీచర్చ్ చేసాను. సినిమా సినిమా కి మార్కెట్ చేసుకోవటం నాకు తెలియదు. సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే తెలుసు. అమిగోస్ తర్వాత నేను చేస్తున్న పాన్ ఇండియా ఫీల్మ్ డెవిల్స్ సినిమా షూటింగ్ 70% కంప్లీట్ అయింది అంటూ కళ్యాణ్ రామ్ చాలా విషయాలను మీడియాతో పంచుకున్నాడు.

No new commitments -Kalyan Ram:

Kalyan Ram Interview about Amigos

Tags:   KALYAN RAM, AMIGOS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ