నందమూరి హీరో తారకరత్న పదిహేను రోజుల క్రితం హార్ట్ ఎటాక్ తో సుఫర్ అవడంతో కుప్పం ఆసుపత్రి నుండి బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు కుటుంబ సభ్యులు. అప్పటినుండి ఇప్పటివరకు తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ కండిషన్ లోనే ఉంది. ఆయనకి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, మెదడు ఓ పక్క డ్యామేజ్ అవడంతో ఆయన నెమ్మదిగా ట్రీట్మెంట్ కి స్పందిస్తున్నారంటూ డాక్టర్స్ గత వారం తారకరత్న హెల్త్ అప్ డేట్ ఇచ్చారు. తర్వాత తారకరత్నని కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం విదేశాలకి తరలిస్తున్నారని అన్నా దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు.
వారం రోజులుగా తారకరత్న హెల్త్ పై ఎలాంటి న్యూస్ మీడియాలో కనిపించడం లేదు. అసలు తారకరత్న ఎలాంటి పొజిషన్ లో ఉన్నాడో కూడా తెలియడం లేదు. కుటుంబ సభ్యులు కూడా అప్పట్లో తారకరత్న శరీరం చికిత్సకి స్పందిస్తుంది అన్నారు. కానీ ఇప్పుడు వారి హడావిడి కనిపించడం లేదు. తాజాగా కళ్యాణ్ రామ్ కి అమిగోస్ ఇంటర్వూస్ లో తారకరత్న ఆరోగ్యం గురించిన ప్రశ్న ఎదురైంది.
దానితో కళ్యాణ్ రామ్ ఏం చెబుతాడా.. తారకరత్న కోలుకుంటున్నాడు త్వరలోనే డిశ్ ఛార్జ్ అవుతాడని చెబుతాడు అనుకుంటే.. కళ్యాణ్ రామ్ మాత్రం తారకరత్న ఆరోగ్యం విషయంలో డాక్టర్స్ ఏమి చెబుతున్నారో అదే నాకు తెలుసు అంటూ స్పందించడం చూస్తే.. తారకరత్న హెల్త్ కండిషన్ ఇంకా క్రిటికల్ గా ఉందా? లేదంటే ఆయన కోలుకుంటున్నారో తెలియక నందమూరి అభిమానులు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కళ్యాణ్ రామ్ తన భార్య స్వాతి, తమ్ముడు ఎన్టీఆర్ అలాగే ఆయన వైఫ్ ప్రణతి తో కలిసి తారకరత్నని చూసేందుకు బెంగుళూరుకి వెళ్ళిన విషయం తెలిసిందే.