అల్లు అర్జున్ నిన్నటివరకు వైజాగ్ లో పుష్ప ద రూల్ షూటింగ్ లో బిజీగా వున్నాడు. సంక్రాంతి తర్వాత 20 డేస్ పాటు వైజాగ్ లోనే ఉండి పుష్ప భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేసిన అల్లు అర్జున్ వైజాగ్ ఫాన్స్ తో ఫోటో షూట్ చెద్దామని రెడీ అయ్యాడు. కానీ అభిమానుల గందరగోళం మధ్యన సోమవారం ఏర్పాటు చేసిన ఫోటో షూట్ క్యాన్సిల్ చేసి అల్లు అర్జున్ వెళ్లిపోవడంతో అల్లు ఫాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అన్న తో ఫోటో దిగుదామని వచ్చాము, కానీ ఆయన వెళ్లిపోయారంటూ కళ్ళ నీళ్లతో మాట్లాడిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అది చూసి అందరూ అయ్యయ్యో అన్నారు.
అయితే నిన్న మంగళవారం కూడా అల్లు అర్జున్ అభిమానుల కోసం గాదిరాజు ప్యాలెస్, రాడిసన్ బ్లూ లో మరోసారి ఫోటో షూట్ ఏర్పాటు చేసి అభిమానులతో కలిసి ఫొటోస్ దిగిన అల్లు అర్జున్.. తన కోసం ఎంతో దూరం నుండి వచ్చిన డై హార్డ్ ఫ్యాన్ దివ్యంగుడు అవడంతో అతన్ని ఎత్తుకుని దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమతో అల్లు అర్జున్ ఫొటోస్ దిగడంతో ఆయన ఫాన్స్ దిల్ ఖుష్ అయ్యామన్నారు.
ఇక అది పూర్తి కాగానే అల్లు అర్జున్ పుష్ప వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ అవడంతో తిరిగి హైదరాబాద్ కి వచ్చేసాడు.