Advertisementt

అంత పెద్ద గాసిప్ ఎందుకింత వైరల్

Wed 08th Feb 2023 09:55 AM
prabhas,kriti sanon  అంత పెద్ద గాసిప్ ఎందుకింత వైరల్
Why is such a big gossip so viral? అంత పెద్ద గాసిప్ ఎందుకింత వైరల్
Advertisement
Ads by CJ

ప్రభాస్-కృతి సనన్ వచ్చే వారం మాల్దీవుల్లో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారనే గాసిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతుంది. అది ఒట్టి గాసిప్.. అయినా నెటిజెన్స్ కి ప్రభాస్ పెళ్లిపై విపరీతమైన ఇంట్రెస్ట్. ఎప్పటినుండో ప్రభాస్ ఆ గుడ్ న్యూస్ చెబుతాడని ఎదురు చూస్తున్నారు.. కానీ ప్రభాస్ సినిమాలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు తప్ప పెళ్లిపై ఆసక్తి పెట్టడం  లేదు. లవ్ ఫెయిల్యూర్.. లేదంటే మారేదన్నా కారణమో కానీ.. ప్రభాస్ కి 40 ఏళ్ళు దాటిపోయినా పెళ్లి విషయంలో కామ్ గా ఉండడం ఆయన ఫాన్స్ కే నచ్చడం లేదు.

ఆదిపురుష్ కృతి సనన్ తో ప్రభాస్ డేటింగ్ అనగానే ప్రభాస్ ఫాన్స్ లో ఎగ్జైట్మెంట్, నెటిజెన్స్ లో ఆత్రుత, గాసిప్ రాయుళ్ళకి మేత అన్నట్టుగా ఆ న్యూస్ విపరీతంగా పాపులర్ అయ్యింది. కానీ అది జస్ట్ రూమారంటూ కృతి సనన్, ప్రభాస్ విడివిడిగా తేల్చిపారేశారు. అప్పటినుండి ఈ గాసిప్ మరుగున పడిపోయింది. కానీ ఉమర్ సందు ప్రభాస్-కృతి సనన్ నిశ్చితార్ధం, అది కూడా మాల్దీవులలో అంటూ చేసిన పిచ్చి ట్వీట్ ని సోషల్ మీడియాలో నెటిజెన్స్ వైరల్ చేస్తూ ట్రెండ్ చెయ్యడం మాత్రం నిజంగా పిచ్చే.

అది గాసిప్ అని తెలుసు. అయినా దానిని వైరల్ చెయ్యడమేమిటో.. ఆ న్యూస్ అంతలా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవడమేమిటో నిజంగా విచిత్రమే. ఇక ప్రభాస్-కృతి సనన్ ఈ గాసిప్ ని పట్టించుకునే స్టేజ్ లో లేరు. ప్రభాస్ వైరల్ ఫీవర్ తో బాధపడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అటు కృతి సనన్ కార్తీక్ ఆర్యన్ తో కలిసి షెహజాద ప్రమోషన్స్ పాల్గొంటూ హడావిడిగా ఉంది. 

Why is such a big gossip so viral?:

Big Gossip: Prabhas-Kriti Sanon engagement news

Tags:   PRABHAS, KRITI SANON
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ