గీత గోవిందం తర్వాత రష్మిక తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయింది. సింపుల్ లుక్స్ తో, మంచి యాక్టింగ్ తో ఆకట్టుకుంది. తర్వాత డియర్ కామ్రేడ్ డిసాస్టర్ అయినా రష్మిక మాత్రం మహేష్ మూవీతో ఫామ్ లోకి వచ్చేసింది. తర్వాత ఏ సినిమా ఎలా ఉన్నా పుష్ప పాన్ ఇండియా ఫీల్మ్ తో రష్మిక ఫేట్ మారిపోయింది. బాలీవుడ్, తమిళ చిత్రాలతో బాగా బిజీగా మారిన రశ్మికపై పాజిటివ్ నెస్ కన్నా ఎక్కువగా నెగిటివిటీనే స్ప్రెడ్ అయ్యింది. ఆమె ఏం మాట్లాడినా తప్పే, ఎలా ఉన్నా తప్పే అనే స్థాయిలో ఆమెని నెటిజెన్స్ ట్రోల్స్ చేసారు. అయితే రష్మిక ఎంతగా గ్లామర్ షో చేసినా ఆమె అబ్బాయిలా కనబడుతుంది. ఆమె ఫిజిక్ అబ్బాయిలా ఉంది అంటూ కామెంట్ చేసేవారు.
ఈమధ్యన ఇదే విషయంలో రష్మిక తెగ బాధపడిపోయింది. వర్కౌట్స్ చేసి గ్లామర్ గా కనబడితే అబ్బాయిలా ఉన్నావంటారు, వర్కౌట్స్ చెయ్యకపోతే బరువు పెరిగిపోయింది అంటారు. నేనేం చేస్తే మీకు నచ్చుతుంది అంటూ గోల పెట్టింది. తాజాగా రష్మిక సూపర్బ్ గ్లామర్ పిక్ షేర్ చేస్తూ Be happy peeps.. keep hope.. your happiness and peace comes above all… Life is just too short for negative feels❤️😚 అంటూ క్యాప్షన్ పెట్టింది.
ఆ పిక్ లో రష్మిక చాలా క్యూట్ గా, స్వీట్ గా, గ్లామరస్ గా కనబడింది. వైట్ డ్రెస్ లో బొడ్డు అందాలను చూపిస్తూ, టూమచ్ గ్లామర్ గా ఉన్న పిక్ అది. నిజంగా రశ్మికని అలా చూస్తే అబ్బ ఏముందిరా బాబు అనకమానరు.