కామెడీ షోకి గ్లామర్ ని పరిచయం చేసి స్టేజ్ మీద డాన్స్ లతో కమెడియన్స్ కి హుషారినిస్తూ ప్రేక్షకులని బుల్లితెరకి అతుక్కుపోయేలా చేసిన అనసూయ.. జబర్దస్త్ షోకి నిజంగా స్పెషల్ అట్రాక్షన్ గానే ఉండేది. కానీ ఇప్పుడు జబర్దస్త్ లో అనసూయ అందాలు లేవు, ఎంతో ఎనర్జిటిక్ గా కమెడియన్స్ తో పాటు స్టేజ్ పై కామెడీ కూడా చేసే అనసూయ జబర్దస్త్ కి దూరమైనా సోషల్ మీడియాకి దగ్గరగానే ఉంటుంది. జబర్దస్త్ లో చూపించే అందాలు ఇప్పుడు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని చూపిస్తుంది.
ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్, వెబ్ సీరీస్ అంటూ షూటింగ్స్ హడావుడితో ఉన్న అనసూయ భరద్వాజ్ బుల్లితెరకి ఆల్మోస్ట్ దూరమైనట్లే కనబడుతుంది. వెండితెర మీద కీలక పాత్రలు రావడంతో బుల్లితెరని లైట్ తీసుకుని వెండితెరకి ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. కానీ సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ షేర్ చేస్తూనే ఉంటుంది. అనసూయ తాజాగా పూలతో రొమాన్స్ అంటూ ప్రొద్దు తిరుగుడు పూల తోటలో చూడచక్కని సారీలో మెస్మరైజ్ చేస్తున్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ప్రొద్దు తిరుగుడు పూల మధ్యన మరో సన్ ఫ్లవర్ లా మారిపోయిన అనసూయ అందాలు నేచురల్ గా ఫ్రెష్ గా కనబడుతున్నాయి. చూడ చక్కని చీర కట్టులో.. ఫుల్లీ ట్రెడిషనల్ లుక్ లో.. మెడలో హారంతో ప్రొద్దు తిరుగుడు పువ్వు మాదిరి అందంగా స్మైల్ చేస్తున్న అనసూయ ని చూస్తే చూపు తిప్పుకోలేరు సుమీ.