వీరసింహారెడ్డిలో యంగ్ హీరోయిన్ శృతి హాసన్ తో జోడి కట్టిన బాలయ్య బాబు ఇప్పుడు మరో గ్లామర్ హీరోయిన్ తో రొమాన్స్ చెయ్యడానికి రెడీ అయ్యారు. వీరసింహారెడ్డిలో పాటల కోసం శృతి హాసన్ ని తీసుకొచ్చాడు దర్శకుడు. సాంగ్స్ లో శృతి హాసన్ లో గ్లామర్ డాల్ లా బాలయ్య పక్కన చిందులు వేసింది. అయితే NBK108 కోసం అనిల్ రావిపూడి ఇప్పుడు కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేశారనే న్యూస్ బాలయ్య ఫాన్స్ కి కిక్ ఇస్తుంది. పెళ్ళయ్యి, బిడ్డ పుట్టాక కూడా కమల్ హాసన్ ఇండియన్ 2 లో కాజల్ నటిస్తుంది.
ఇప్పుడు బాలయ్య సినిమా కి కాజల్ సైన్ చేయబోతుంది అని, దాని కోసం ఆమె రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేసిందట. సోషల్ మీడియా నుండి అందుతున్న సమాచారం మేరకు కాజల్ అగర్వాల్ NBK108 లో నటించేందుకు ఏకంగా 3 కోట్లు డిమాండ్ చేసిందట. మరి గ్లామర్ డాల్, అలాగే ఇప్పటికి క్రేజ్ ఉన్న హీరోయిన్ కాబట్టి కాజల్ అడిగిన పెద్ద మొత్తాన్ని ఇచ్చేందుకు నిర్మాతలు రెడీ అయ్యారట.
ఈ చిత్రం మరో హీరోయిన్ శ్రీలీల బాలయ్యకి కూతురు కేరెక్టర్ లో నటిస్తుంది. ఆమెకి కూడా భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈచిత్రంలో బాలయ్య తో తలపడబోయే విలన్ విషయంలో నందమూరి ఫాన్స్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నారు. అనిల్ రావిపూడి ఏ విలన్ ని బాలయ్య కోసం ప్రవేశ పెడతాడో చూడాలి.