మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం వాల్తేర్ వీరయ్య సంక్రాంతి పండగ స్పెషల్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి మాస్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించింది. చిరంజీవి-రవితేజ కాంబోని ప్రేక్షకులు బాగా లైక్ చేసారు. వాల్తేర్ వీరయ్య వీర విహారం ముందు వీరసింహారెడ్డి, వారసుడు కూడా కలెక్షన్స్ చిన్న బోయాయి. దర్శకుడు బాబీ మెగా ఫాన్స్ చేతే కాదు, మాస్ ఆడియన్స్ చేత కూడా వీరయ్య తో మెప్పించాడు. వాల్తేర్ వీరయ్య కలెక్షన్స్ తో నిర్మాతలు హ్యాపీ. థియేటర్స్ లో విజయవిహారం చేసిన వాల్తేర్ వీరయ్య ఓటిటి హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది.
జనవరి 13 న థియేటర్స్ లో విడుదలైన వాల్తేర్ వీరయ్య ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసింది నెట్ ఫ్లిక్స్. ఈ నెల అంటే ఫిబ్రవరి 27 న నెట్ ఫ్లిక్స్ లో వాల్తేర్ వీరయ్య స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా అఫీషియల్ గా ప్రకటన ఇచ్చేసారు. మరి థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు వాల్తేర్ వీరయ్య ఓటిటి రిలీజ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ డేట్ ఇవ్వగానే.. ఇంకా రెండు వారాలు వెయిట్ చెయ్యాలా అంటున్నారు. మరి ఈ రెండు వారాల్లో వాల్తేర్ వీరయ్య ని ఓటిటి వేదికగా చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ రెడీ అవుతున్నారు.