అఖిల్ ఏజెంట్ విషయంలో మొదటినుండి ఏదో జరుగుతుంది అనే అనుమానాలు అక్కినేని ఫాన్స్ కి ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో భారీ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఏజెంట్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతుంది. అఖిల్ ఏజెంట్ లుక్ అభిమానులనే కాదు అందరిని ఆకట్టుకుంది. అఖిల్ ఏజెంట్ మేకోవర్ కి ఫాన్స్ ముగ్దులయ్యారు. అయితే ఏజెంట్ లుక్, టీజర్ తో భారీ హైప్ క్రియేట్ చేసిన మేకర్స్ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం అభిమానులు బాగా ఇబ్బంది పెట్టి.. చివరికి ఏప్రిల్ 28 న ఫైనల్ గా డేట్ ని ఫిక్స్ చేసారు.
ఇప్పుడు ఏజెంట్ డేట్ ఇచ్చేసారు కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదనే టాక్ తో పాటుగా.. సురేందర్ రెడ్డికి గతంలో తెరకెక్కించిన ఏజెంట్ యాక్షన్ సీక్వెన్స్ పై సంతృప్తి గా లేకపోవడంతో మరోసారి ఏజెంట్ యాక్షన్ సీక్వెన్స్ కోసం అరేబియాలోని మస్కట్ వెళ్తున్నారని తెలుస్తోంది. అక్కడే 15 రోజుల పాటు ఏజెంట్ అఖిల్ పై హెవీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ యాక్షన్ సన్నివేశాల ఖర్చు మూడు కోట్లకి పైమాటే అంటున్నారు. అప్పుడు తీసిన యాక్షన్ సీక్వెన్క్ పక్కనబడేసి ఇప్పుడు ఫ్రెష్ గా మరోమారు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారట.
ఏజెంట్ పై ఎన్ని అంచనాలైతే ఉన్నాయో.. సోషల్ మీడియాలో అన్నే రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ విషయంలో అభిమానులు కంగారు పడుతూనే ఉన్నారు. మేకర్స్ ఏజెంట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ముంబై మోడల్ సాక్షి వైదే అఖిల్ తో రొమాన్స్ చేయనుంది.