ఆరేళ్లుగా తెలుగులో బిగ్ బాస్ ని స్టార్ మా సక్సెస్ ఫుల్ గానే హ్యాండిల్ చేస్తుంది. కొన్ని సీజన్స్ నుండి బిగ్ బాస్ పై క్రేజ్ తగ్గినా స్టార్ మా కి పెద్ద గా లాస్ ఏమి రావడం లేదు. అందుకే ప్రతి ఏడు బిగ్ బాస్ ని గ్రాండ్ గానే మొదలు పెట్టి క్లోజ్ చేస్తున్నారు. అయితే స్టార్ మా లో వచ్చే సీజన్స్ సక్సెస్ అవడంతో.. నార్త్ మాదిరిగా బిగ్ బాస్ యాజమాన్యం ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చింది. గత ఏడాది 24/7 అంటూ బిగ్ బాస్ ఓటిటి ని స్టార్ట్ చేసారు. ఆ సీజన్ లో బిందు మాధవి ఓటిటి విన్నర్ గా నిలిచింది. అయితే గత ఏడాది ఓటిటి సీజన్ చాలా చప్పగా నడిచింది. అలాగే స్టార్ మాలో గత సీజన్ కూడా అష్టకష్టాలు పడి ఎలాగో పూర్తి చేసుకుంది. ఏదిఏమైనా బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ పై ఇంట్రెస్ట్ పెట్టడం తగ్గించారు,
దానితో ఈ ఏడాది బిగ్ బాస్ ఓటిటి సీజన్ ఎత్తేశారనే టాక్ నడుస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ ఓటిటి ని ప్రసారం చేసే యాజమాన్యం.. ఈ ఏడాది బిగ్ బాస్ ఓటిటిని ఆపేసింది అందుకే.. ఓటిటికి తీసుకోబోయే కంటెస్టెంట్స్ వివరాలు బయటకి రావడం లేదు. లేదంటే గత ఏడాది ఫిబ్రవరి చివరిలో బిగ్ బాస్ ఓటిటి మొదలైంది. కానీ ఈ ఏడాది ఆ ముచ్చటే లేదు. సో దీనిని బట్టి బిగ్ బాస్ ఓటిటీని ఆపేశారని అంటున్నారు. అయితే ఈ విషయమై ఓ వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కొందరు.
కొందరేమో.. ఒకవేళ బిగ్ బాస్ ఓటిటి సీజన్ 2 ఉంటే గనక ఈపాటికే నాగార్జున గారు ఏ ప్రోమోతోనో దిగిపోయే వారు, అలాగే సోషల్ మీడియాలోనూ కంటెస్టెంట్స్ వివరాలు అంటూ కొన్ని పేర్లు చక్కర్లు కొట్టేవి, అటు బిగ్ బాస్ ఓటిటికి వచ్చేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ కూడా చూపించని కారణంగానే ఈ సీజన్ ఆపేశారనే కామెంట్స్ చేస్తున్నారు.