Advertisementt

భయపెడుతున్న అనసూయ

Mon 06th Feb 2023 08:33 PM
anasuya bharadwaj  భయపెడుతున్న అనసూయ
Anasuya New look భయపెడుతున్న అనసూయ
Advertisement
Ads by CJ

బుల్లితెర మీద గ్లామర్ గా పరిచయమై.. జబర్దస్త్ తో యూత్ ని, కామెడీ లవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ.. మెల్లగా సిల్వర్ స్క్రీన్ పైకి చేరి.. అక్కడ తన టాలెంట్ తో అద్భుత అవకాశాలు అందుకుని.. తనకి లైఫ్ నిచ్చిన జబర్దస్త్ కి కొద్దిరోజులు విరామం ప్రకటించి వెండితెరపై అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న అనసూయ భరద్వాజ్ కి పుష్ప పాన్ ఇండియా హిట్ బూస్ట్ నిచ్చింది. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండడంతో జబర్దస్త్ కి దూరమయ్యని చెప్పిన అనసూయ అసలైతే తన పిల్లలతో సమయం గడిపేందుకు టైమ్ దొరకని కారణంగానే జబర్దస్త్ కి దూరమైనట్లుగా తెలుస్తుంది.

అదలాఉంటే అనసూయ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ మైకేల్ ఘోరమైన డిసాస్టర్ అయ్యింది. అందుకే ఆ సినిమా విషయంలో అనసూయ కామ్ గా ఉండిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం అనసూయ తన లుక్స్ తో భయపెడుతుంది. పిల్లికళ్ళతో అనసూయ ఇచ్చిన ఫోజు చూస్తే నిజంగా భయపడడం ఖాయం. హెయిర్ ని టైట్ గా ముడివేసి.. సిల్వర్ జ్యువలరీతో అనసూయ పిల్లి కళ్ల గెటప్ హారర్ ని తలపించేదిలా ఉంది.

అనసూయ నటించిన, నటిస్తున్న సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. రంగమార్తాండ రిలీజ్ కి రెడీ అవుతుంది. పుష్ప పార్ట్ 2 షూటింగ్ కి అనసూయ జాయిన్ అవ్వాల్సి ఉంది.

Anasuya New look:

Anasuya Bharadwaj New horror look

Tags:   ANASUYA BHARADWAJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ