Advertisementt

బాలయ్య సంస్కారం

Mon 06th Feb 2023 01:43 PM
nandamuri balakrishna,nurses  బాలయ్య సంస్కారం
Balakrishna Official Statement బాలయ్య సంస్కారం
Advertisement
Ads by CJ

కొద్దిరోజులుగా విపరీతమైన ఫామ్ లో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ ఆహా అన్ స్టాపబుల్, వీర సింహ రెడ్డి సక్సెస్ లతో అభిమానుల గుండెల్లో గుడి కట్టించేసుకున్నారు. సాధారణ ప్రేక్షకుడి నుండి ప్రశంశలు అందుకుంటున్నారు. అదే స్థాయిలో ఇప్పుడు ఆయన మాటలని వక్రీకరిస్తూ యాంటీ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. బాలకృష్ణ వీర సింహారెడ్డి ఈవెంట్ లో అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై అక్కినేని ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నానా హంగామా చెయ్యగా.. నాకు అక్కినేనికి ఉన్న అనుబంధం అది.. ఆయన్ని నేను ఎందుకు కించపరుస్తాను అంటూ వివరణ ఇచ్చిన బాలకృష్ణ.. ఇప్పుడు మరోసారి వివాదాస్పదం అయ్యారు.

అన్ స్టాపబుల్ టాక్ షోలో పవన్ కళ్యాణ్ తో తన యాక్సిడెంట్ విషయం చెబుతూ.. నేను ఎక్కడో పడ్డాను, యాక్సిడెంట్ కాదు అని చెప్పమన్నాను. అయితే ఆసుపత్రిలో నర్స్ బావుంది.. దానెమ్మ అది నా యాక్సిడెంట్ విషయం మా నాన్నగారికి చెప్పేసింది అంటూ మాట్లాడిన మాటలు కాంట్రవర్సీకి కారణమయ్యాయి. నర్స్ ల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ వారు ధర్నాలు మొదలు పెట్టారు. దీనితో బాలయ్య ఆ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

అందరికి నమస్కారం,

నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ... నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు  కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. 

అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ... మీ నందమూరి బాలకృష్ణ. 

ఆ ట్వీట్ చూసిన నందనమూరి అభిమానులు మా బాలయ్య ఫ్లోలో మాట్లాడిన మాటలను, సరదాగా మాట్లాడిన మాటలను పట్టుకుని రాద్ధాంతం చెయ్యడం ఎందుకు.. ఇప్పుడు చూసారా మా బాలయ్య సంస్కారం అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.

Balakrishna Official Statement :

Nandamuri Balakrishna Official Statement About His Comments On Nurses

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ