Advertisementt

హీరోల ఫాన్స్ కి వార్నింగ్

Mon 06th Feb 2023 09:49 AM
ntr,amigos event  హీరోల ఫాన్స్ కి వార్నింగ్
NTR Warning To His Fans హీరోల ఫాన్స్ కి వార్నింగ్
Advertisement
Ads by CJ

స్టార్ హీరోల అభిమానులు ఈమధ్యన హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. తమ హీరోకి సంబందించిన ఏ అప్ డేట్ అయినా వాళ్ళు అనుకున్న సమయానికి ఇవ్వకపోతే సదరు నిర్మాణ సంస్థలని ఆడుకోవడం కాదు, బూతులు తిడుతూ ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అభిమానుల రచ్చ శృతిమించి హీరోలకి, నిర్మాతలకి, దర్శకులకి పెద్ద తలనొప్పిగా మారింది. కొన్నిసార్లు ఈ విషయంలో స్టార్ హీరోలు ఇబ్బంది పడుతున్నారు. ఇక నిర్మాతలని, నిర్మాణ సంస్థలని హీరోల ఫాన్స్ కించపరుస్తూ మాట్లాడుతుంటారు. ఫాన్స్ వార్ అనేది సహజం. కానీ హీరోల ఫాన్స్ అది వదిలేసి.. నిర్మాణ సంస్థలపై పడుతుంటే వాళ్లపై ఒత్తిడి పెరిగిపోతుంది. చాలామంది సోషల్ మీడియా నెగిటివిటీని తట్టుకోలేక సోషల్ మీడియాకి దూరమవుతున్నారు.

తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ అభిమానుల అతికి కళ్లెం వేసేలా మట్లాడడం హాట్ టాపిక్ అయ్యింది. నేను నా ఫాన్స్ కి మత్రమే కాదు అందరి ఫాన్స్ కి చెబుతున్నాను.. మీరు పదే పదే అప్ డేట్స్ అడుగుతూ హడావిడి చేస్తుంటే నిర్మాతలపై ఒత్తిడి పెరిగిపోతుంది.. అంటూ అమిగోస్ ఈవెంట్ లో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అభిమానుల సంతోషం కంటే మాకు ఏది ఎక్కువ కాదు. కాని అప్ డేట్ అడుగుతూ ఉంటే కొన్నిసార్లు నిర్మాతలు దర్శకుడు తీవ్రస్థాయిలో ఒత్తిడికి గురి అవుతున్నారని అన్నారు. 

ఇది నేను మా గురించి మాత్రమే చెప్పడం లేదని దాదాపు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న ఇబ్బంది అని అన్నారు. మంచి కంటెంట్ ఇవ్వడానికి మేము ఎప్పుడు ముందుంటాము. సినిమా అప్ డేట్ సరైన టైమ్ లో ఇస్తాము. ఏ అప్ డేట్ అయినా మా భార్యల కంటే ముందు మీకే చెబుతాము.. అంటూ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు స్టార్ హీరోల అభిమానులు ఓ వార్నింగ్ లా తీసుకోవాలి. లేదంటే కష్టం.

NTR Warning To His Fans :

NTR Takes Class To Fans About Updates In Amigos Event

Tags:   NTR, AMIGOS EVENT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ