Advertisementt

RC15 లుక్ కి ముహూర్తం కుదిరింది

Sun 05th Feb 2023 09:06 PM
rc15,ram charan  RC15 లుక్ కి ముహూర్తం కుదిరింది
RC15 title and look on a special day RC15 లుక్ కి ముహూర్తం కుదిరింది
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తర్వాత కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మూడు భాషల్లో భారీ మూవీ చేస్తున్నారు. RC15 మొదలై ఏడాదిన్నర గడిచినా సినిమాకి సంబందించిన లుక్ కానీ, టైటిల్ కానీ విడుదల చెయ్యలేదు. దానితో మెగా ఫాన్స్ RC15 మేకర్స్ పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేసినా దిల్ రాజు లైట్ తీసుకుంటున్నాడు కానీ మెగా ఫాన్స్ ఆత్రుతని అర్ధం చేసుకోవడం లేదు. గత ఏడాది రామ్ చరణ్ బర్త్ డే కే RC15 టైటిల్ రివీల్ చేయబోతున్నారని అన్నారు.

మళ్ళీ రామ్ చరణ్ పుట్టిన రోజు వచ్చేసినా RC15 హడావిడి కనబడడం లేదు. తాజాగా RC15 కొత్త షెడ్యూల్ మొదలయ్యింది. ఈ షెడ్యూల్ లో ఓ సాంగ్ షూట్ చేస్తారట. ఈ పాటకు సంబంధించి మిగతా పార్ట్ ను వైజాగ్ మరియు రాజమండ్రి ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. హీరోయిన్ కియారా అద్వానీ పెళ్లి పీటలెక్కడానికి రాజస్థాన్ వెళ్ళింది. అదలాఉంటే రామ్ చరణ్ బర్త్ డే కి RC15 లుక్ తో పాటుగా టైటిల్ కూడా రివీల్ చేయబోతున్నారట. అంటే మరో నెలన్నర లో RC15 లుక్ టైటిల్ రివీల్ అవ్వబోతున్నాయన్నమాట. మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్ డే. ఆ రోజే RC15 లుక్ అండ్ టైటిల్ ఇస్తారట.

RC15 title and look on a special day:

RC15 first look and title details out

Tags:   RC15, RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ