సమంత ఇప్పుడు ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్కే. టాప్ హీరోయిన్, నాగ చైతన్య తో పెళ్లి, అక్కినేని ఫ్యామిలీతో అనుబంధం, తరువాత విడాకులు, మధ్యలో నెటిజెన్స్ ట్రోలింగ్, ఈమధ్యలో మయోసిటిస్ వ్యాధితో బాధపడుతూ.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సమంత కామ్ గా సైలెంట్ గా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చెయ్యకపోయినా ఆమె పేరు మాత్రం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా మాయోసైటిస్ వ్యాధిని సమర్ధవంతంగా ఎదుర్కొని మళ్ళీ ఎప్పటిలాగే షూటింగ్స్ కి సన్నద్ధం అయ్యింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ వెబ్ సీరీస్ అలాగే విజయ్ దేవరకొండ తో కలిసి కుషి చిత్ర షూటింగ్స్ కి రెడీ అవుతుంది. తన వలనే కుషి చిత్రం షూటింగ్ లేట్ అవుతున్నందువల్ల విజయ్ దేవరకొండ ఫాన్స్ కి సారి చెప్పింది కూడా. అయితే సమంత శాకుంతలం ప్రమోషన్స్ ఈ రెండు సినిమాల షూటింగ్స్ కోసం శక్తిని తెచ్చుకుంది. తాజాగా ఆమె కారులో ప్రయాణం చేస్తూ ఓ పిక్ పోస్ట్ చేసింది.
ఆ పిక్ తో పాటుగా వెలుతురుని మనమే వెతుక్కోవాలి అంటూ క్యాప్షన్ పెట్టింది. ఆ పిక్ లో సమంత కళ్ళుమూసుకుని కనిపిస్తుంది. ఇప్పటివరకు తన సమస్యతో చీకటిలో ఉంది.. ఇప్పుడే వెలుతురిలోకి వస్తున్నట్టుగా సమంత పెట్టిన పోస్ట్ ఉంది.