సీనియర్ హీరోయిన్ భానుప్రియ కె విశ్వనాథ్ స్వర్ణకమలం, అలాగే వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ లతో నటించి మెప్పించిన ఆవిడ తరువాత కొన్నాళ్ళు కేరెక్టర్ ఆర్టిస్ట్ గా ఛత్రపతిలో ప్రభాస్ తల్లిగా కనిపించారు. తర్వాత కొద్దిరోజులుగా మీడియా కి కనిపించనే లేదు. ఆ మధ్యన ఎప్పుడో పని మనిషి వివాదంలో హైలెట్ అయిన భాను ప్రియ మళ్ళీ ఇన్నాళ్ళకి వార్తల్లోకి వచ్చారు.
భానుప్రియ భర్త చనిపోయాక తాను మతిమరుపుతో బాధపడుతున్నట్టుగా చెప్పారు. తాజాగా ఆవిడ మాట్లాడుతూ మావారు చనిపోయారు .. అప్పటి నుంచి మెమరీ లాస్ అయ్యాను. సినిమాల్లో నటిద్దామంటే డైలాగ్స్ కూడా గుర్తుండటం లేదు. ఒకప్పుడు డాన్స్ లో ఎంతో ప్రవీణ్యం ఉన్న భాను ప్రియ ఇప్పుడు డాన్స్ కి సంబంధించిన ముద్రలు కూడా గుర్తుండటం లేదు అంటున్నారు. అందువల్లనే డాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచనను కూడా విరమించుకోవడం జరిగింది. అయితే మతిమరుపుకి నేను ప్రస్తుతానికి మెడిసిన్స్ తీసుకుంటున్నాను అని చెప్పారు.
అంతేకాకుండా తన భర్త తనకి దూరమయ్యే సమయానికి నేను ఆయనతో విడిపోయినట్లుగా ప్రచారం జరిగింది. అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఆయన
ఉన్నప్పుడు ఇక్కడికి వస్తుండేవారు, నేను అక్కడికి వెళుతూ ఉండేదానిని. మేము విడిపోయి బ్రతికామనేది మాత్రం వట్టి పుకారు మాత్రమే. ప్రస్తుతం మా అమ్మాయి అభినయం లండన్ లో చదువుతోంది. అభినయ కి సినిమాల వైపు వచ్చే ఆలోచన లేదు అంటూ భాను ప్రియ ఫ్యామిలీ విషయాలని, తనకున్న డిసీస్ ని బయటపెట్టారు.