Advertisementt

జబర్దస్త్ వర్షపై నెటిజెన్స్ ఫైర్

Sun 05th Feb 2023 10:15 AM
jabardasth,varsha  జబర్దస్త్ వర్షపై నెటిజెన్స్ ఫైర్
Netizens fires on Jabardasth Varsha జబర్దస్త్ వర్షపై నెటిజెన్స్ ఫైర్
Advertisement
Ads by CJ

సీరియల్స్ నటులు, కేరెక్టర్ ఆర్టిస్ట్ లు, బిగ్ బాస్ కి వెళ్ళొచ్చినవారు కరోనా క్రైసిస్ లో యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని వీడియోస్ చేస్తూ చేతినిండా సంపాదిస్తున్నారు. వారు ఏం చేసినా ఓ వీడియో సోషల్ మీడియాలో ఉండాల్సిందే. కూరగాయలకెళ్లినా, దగ్గినా, తుమ్మినా, హోమ్ టూర్ అబ్బో ఇలాంటి వీడియోస్ తో తమ క్రేజ్ ని ప్రేక్షకుల మీద రుద్ది మరీ డబ్బు చేసుకుంటున్నారు. కొంతమంది ప్రాంక్ వీడియోస్ అంటూ ఆడియన్స్ ని ఆటపట్టిస్తున్నారు. కొన్నిసార్లు శృతి మించి తిట్లు తింటున్నారు. తాజాగా జబర్దస్త్ వర్ష కూడా ఇలాంటి వీడియో చేసి నెటిజెన్స్ చేతిలో తిట్లుతింది.

సీరియల్స్ నుండి జబర్దస్త్ స్టేజ్ పైకి గ్లామర్ గా టర్న్ అయిన వర్ష.. యాంకర్ అనసూయ-రష్మీ ల అందానికే పోటీ ఇచ్చేదిలా తయారైంది. ఇమాన్యువల్-భాస్కర్ స్కిట్స్ తో ఫెమస్ అయిన వర్ష ఇమ్ము తో లవ్ లోకి ఉంది అంటూ ఏదో జబర్దస్త్ వాళ్ళు క్రియేట్ చేసారు. కానీ ఇమ్మాన్యువల్ నల్లనివాడు, వర్ష తెల్లని పిల్ల.. ఈ బంధం అస్సలు వర్కౌట్ అవ్వదు. అయినా ఏదో తంటాలు పడతారు. 

తాజాగా తనతో రాత్రికి నిశ్చితార్ధం అంటూ హడావిడిగా చెప్పడంతో ఇలా తయారయ్యా అంటూ ఓ వీడియో చేసింది. అవునా వర్షకి నిశ్చితార్ధమా ఎవ్వరితో అనుకునేలోపు.. జబర్దస్త్ రాకింగ్ రాకేష్ తన నిశ్చితార్ధమని ఒక్కరోజు ముందు చెప్పడంతో అతని ఎంగేజ్మెంట్ కి ఇలా రెడీ అయ్యి వెళ్లానంటూ చావుకబురు చల్లగా చెప్పడంతో.. వీడియోస్ లైక్స్ కోసం ఇంత దిగజారిపోవాలా అంటూ నెటిజెన్స్ వర్ష పై ఫైర్ అవుతున్నారు. 

Netizens fires on Jabardasth Varsha :

Jabardasth Varsha latest video viral

Tags:   JABARDASTH, VARSHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ