Advertisementt

ఆఖరికి అఖిల్ దిగుతున్నాడు

Sat 04th Feb 2023 04:08 PM
akhil,agent releasing on april  ఆఖరికి అఖిల్ దిగుతున్నాడు
Agent Releasing On April 28, 2023 ఆఖరికి అఖిల్ దిగుతున్నాడు
Advertisement
Ads by CJ

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేనిసురేందర్ రెడ్డిల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏజెంట్ థియేట్రికల్ లోకి ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అక్కినెయ్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఏజెంట్ ఇప్పటికే బోలెడన్ని రిలీజ్ డేట్స్ మార్చుకోవడంతో ఆ ఉత్కంఠ ఇప్పుడు మరింత ఎక్కువైంది.  ఇక మేకర్స్ అభిమానులని ఊరించి ఊరించి ఫైనల్లీ ఏజెంట్ రిలీజ్ డేట్ అప్ డేట్ ఇచ్చారు.. న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ మేకింగ్ వీడియోను విడుదల చేసి ఏజెంట్‌ని వేసవిలో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా హాలిడే సీజన్‌లో క్యాష్ చేసుకోబోతోంది. అలాగే పాన్ ఇండియా రిలీజ్ కోసం సమ్మర్ బెస్ట్ సీజన్.

ఏజెంట్ వైల్డ్ యాక్షన్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. అఖిల్‌ని కుర్చీకి కట్టేసి, తలకు మాస్క్‌ కప్పారు. అతను పని చేస్తున్న ఏజెన్సీ గురించి అడిగినప్పుడు, ఒసామా బిన్ లాడెన్, గడాఫీ, హిట్లర్ అని సమాధానమిచ్చాడు. ముఖం అంతా రక్తంతో నిండి.. తనని తాను వైల్డ్ సాలేగా పిలవడం  క్యూరియాసిటీ పెంచింది.

విడుదల తేదీ గ్లింప్స్ చాలా వైల్డ్ గా ఉంది. అఖిల్ పాత్ర యొక్క వైల్డ్ సైడ్‌ను ప్రజంట్ చేసింది. అఖిల్ ఈ చిత్రంలో పొడవాటి,  గిరజాల జుట్టుతో  విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం స్టైలిష్ మేక్ఓవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ అబ్స్‌తో కనిపిస్తాడు. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఇతర స్పై థ్రిల్లర్‌లకు పూర్తి భిన్నంగా రూపొందించారు.

సాక్షి వైద్య అఖిల్  కు జోడిగా నటిస్తోంది.  మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రసూల్ ఎల్లోర్  కెమరామెన్ గా పని చేస్తుండగా, హిప్ హాప్  సంగీతాన్ని అందిస్తున్నారు.

Agent Releasing On April 28, 2023:

Akhil Agent Releasing On April 28, 2023

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ