పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలయికలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న మాస్ మసాలా సలార్ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వబోతుంది. సలార్ లుక్ లో ప్రభాస్ అందరిని అంటే మాస్ ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్స్ చేసాడు. మధ్యలో ప్రభాస్ లుక్ లీక్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమార్ సలార్ విలన్ గా కనిపించడంతో సినిమాపై అంచనాలు, క్రేజ్ విపరీతంగా ఉన్నాయి.
అయితే గత ఏడాది మే లోనే సలార్ టీజర్ ఇస్తామని సలార్ మేకర్స్ ప్రకటించారు. కానీ ప్రభాస్ బర్త్ డే కి కూడా సలార్ టీజర్ వదల్లేదు. దానితో ప్రభాస్ ఫాన్స్ బాగా డిస్పాయింట్ అయ్యారు. ఆ 'మే' పోయి ఈ 'మే' వస్తుంది కనీసం సలార్ టీజర్ విషయంలో మేకర్స్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోయేసరికి ప్రభాస్ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా హీరో మాస్ కటౌట్ చూడడానికి మేమెంతగా వెయిట్ చెయ్యాలి అంటూ గోల చేస్తున్నారు.
మరి సలార్ సెప్టెంబర్ లో కదా రిలీజ్ అయ్యేది అప్పుడే టీజర్ ఎందుకు అని మేకర్స్ అనుకుంటున్నారేమో.. అందుకే ఎలాంటి అప్ డేట్ లేకుండా సైలెంట్ గా ఉన్నారు, కనీసం షూటింగ్ అప్ డేట్ అయినా ఇస్తే ఫాన్స్ శాంతిస్తారు.. ఆ పనేదో చూడండి బాస్.