నటి అదితి రావు హైదిరీ ప్రస్తుతం హీరో సిద్దార్థ్ తో డేటింగ్ లో ఉంది. సిద్దార్థ్ తో అదితి డేటింగ్ లో ఉన్న విషయం సీక్రెట్ గా మెయింటింగ్ చేస్తున్నా వీరిద్దరూ జంటపక్షుల్లా ముంబై వీధుల్లో కనిపించడమే కాదు, రీసెంట్ గా శర్వానంద్ నిశ్చితార్థంలో సిద్దు-అదితిలు జంటగా ప్రత్యక్షమయ్యారు. వీరిరువురూ రెండో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఆల్రెడీ సిద్ధుకి పెళ్లయ్యింది. విడాకులు అయ్యాయి. అటు అదితి రావు కి ముంబైకి చెందిన సత్యదేవ్ తో పెళ్లయ్యింది. 2013 లో వాళ్ళకి విడాకులయ్యాయి.
అయితే తాజాగా అదితి రావు హైదరి మాజీ భర్త అదితిపై సంచలన వ్యాఖ్యలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అదితి మాజీ భర్త సత్యదేవ్ మిశ్రా ఈమధ్యనే బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మసబాని గుప్తాని రెండో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా అదితితో రిలేషన్, విడాకుల విషయం మట్లాడుతూ.. అదితితో నా రిలేషన్ కారణంగా నాకు ప్రేమ, పెళ్లి అంటేనే విరక్తి కలిగింది. మళ్ళీ ప్రేమ, పెళ్లి అంటేనే భయంవేసింది, ప్రేమలో ఫెయిల్ అయిన వారికి మళ్ళీ మరో బంధం అంటే భయం వేస్తుంది. కానీ ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనం కోల్పోయినవి మనం మళ్ళీ పొందగలం.
నేను నాకు నచ్చిన, నన్ను అర్ధం చేసుకున్న మసబాని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. అది కూడా కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యన సింపుల్ గా జరిగినా, ఇండస్ట్రీలోని కొద్దిమంది సన్నిహితులకు చిన్న పార్టీ ఇచ్చాము, ఎందుకంటే మా బంధాన్ని మేము సీక్రెట్ గా ఉంచాలనుకోవడం లేదు, సీక్రెట్స్ అనేవి బంధాన్ని బలంగా ఉంచలేవు అంటూ అదితి సిద్దార్థ్ తో రహస్య డేటింగ్ పై ఇండైరెక్ట్ గా కామెంట్ చేసాడు సత్యదేవ్ మిశ్రా.