Advertisementt

మౌనంగా మంచు మనోజ్

Fri 03rd Feb 2023 04:34 PM
manchu manoj,bhuma mounika  మౌనంగా మంచు మనోజ్
Silent mode in Manchu Manoj మౌనంగా మంచు మనోజ్
Advertisement
Ads by CJ

సోషల్ మీడియా లెక్క ప్రకారం అయితే మంచు మనోజ్ కి ఈపాటికే రెండో పెళ్లి జరిగిపోవాలి. కానీ మంచు ఫ్యామిలీ నుండి అలాంటి సంకేతాలేమి కనిపించలేదు. భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడనేది మాత్రం నిజం. ఆ పెళ్ళి ఎప్పుడనేది మంచు మనోజ్ కానీ, మంచు ఫ్యామిలీకి కానీ, భూమా ఫ్యామిలీ కానీ ఎక్కడా చెప్పలేదు. ఫిబ్రవరి 2 న మంచు మనోజ్ రెండో పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టేశాయి.

కానీ మంచు మనోజ్ -మౌనిక రెడ్డిల వివాహానికి తేదీ ఇంకా నిర్ణయించలేదో.. లేదంటే మరేదన్నా కారణమో కానీ మనోజ్ కి మళ్ళీ పెళ్లయినట్లుగా ఎలాంటి లీకు లేదు. మంచు వారి ఫ్యామిలి కూడా మౌనంగానే కనబడుతుంది. ముందునుండి మనోజ్ సెకండ్ మ్యారేజ్ విషయంలో మంచు ఫ్యామిలీ సైలెన్స్ నే మెయింటింగ్ చేస్తుంది. అందుకే ఈ పెళ్లి విషయంలో కూడా వాళ్ళు లైట్ గానే ఉన్నారు. మనోజ్ మాత్రం అప్పుడప్పుడు నంద్యాలలో కనబడుతున్నాడు. మౌనిక రెడ్డి ఫ్యామిలీతో తిరుగుతున్నాడు.

కానీ పెళ్లి విషయంలో మనోజ్ ఇంకా ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా లేడు. లేదంటే ఫిబ్రవరి 2 న మనోజ్ పెళ్ళయితే.. ఈపాటికి ఆ ముచ్చట మీడియాలో హైలెట్ అయ్యేది కదా. అందుకే మౌన ముద్రలో మనోజ్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Silent mode in Manchu Manoj:

Manchu Manoj to marry Bhuma Mounika

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ