Advertisementt

పెళ్లిళ్ళపై పవన్ సూపర్బ్ క్లారిటీ

Fri 03rd Feb 2023 10:35 AM
unstoppable,balakrishna,pawan kalyan  పెళ్లిళ్ళపై పవన్ సూపర్బ్ క్లారిటీ
Pawan superb clarity on three marriages పెళ్లిళ్ళపై పవన్ సూపర్బ్ క్లారిటీ
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ వైసీపీ మంత్రులు, నేతలు పదే పదే పవన్ కళ్యాణ్ ని కించపరుస్తూ రావడంతో ఏపీ రాజకీయాల్లో అదో పెద్ద న్యూసెన్స్ లా తయారైంది. ఆ పెళ్లిళ్ళపై ఎప్పుడూ ఎవరికీ క్లారిటీ ఇవ్వని పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో లో సూపర్బ్ కాదు తనని విమర్శించే నేతలకి స్ట్రాంగ్ గా క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా బాలకృష్ణ ఆహా అన్ స్టాపబుల్ టాక్ షోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ ని బాలయ్య ఈ పెళ్లిళ్ల గొడవేమిటి భయ్యా అని కదిపారు. దానికి పవన్ కళ్యాణ్ సూటిగా జవాబు చెప్పారు. తాను చాలా సంప్రదాయంగా బ్రతికే వ్యక్తిని అంటూ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయాలను వివరించారు.

నేను అసలు జీవితంలో పెళ్లి చేసుకోవాలనుకోలేదు. లైఫ్ లాంగ్ బ్రహ్మచారిగా ఉండిపోవాలి, యోగమార్గంలో కలిసిపోవాలి అనుకున్నా. అక్కడ నుంచి నా జీవిత ప్రయాణం చూస్తే నాకే ఇలా జరిగిందా అనిపిస్తుంటుంది. వాస్తవానికి నేను చాలా సంప్రదాయంగా బతికే వ్యక్తిని, నా మొదటి పెళ్లి ఇంట్లో వాళ్లు చూసి సంబంధం. ఆ రిలేషన్‌షిప్‌లో కొన్ని కుదరలేదు కాబట్టి విడిపోవాల్సి వస్తుంది. రెండోపెళ్లి చేసుకున్నప్పుడు కూడా అభిప్రాయ భేదాల్లాంటివి వచ్చాయి. ఇద్దరికీ ఏకాభిప్రాయం రాలేదు. అందుకే విడిపోక తప్పలేదు అంటూ పవన్ తన ఇద్దరు భార్యలతో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో చెప్పారు. అంతేకాకుండా తాను వ్యామోహంతో పెళ్లిళ్లు చేసుకోలేదు, ఒకళ్ళతో కుదరలేదు, విడిపోయాం, రెండోసారి చేసుకున్నా అదీ అలానే జరిగింది, అంతేకాని కోరికలతో, వ్యామోహంతో పెళ్లిళ్లు చేసుకోలేదంటూ పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టారు.

రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి నన్ను విమర్శించడానికి అది ఒక ఆయుధం అయింది. నేను ఆ విమర్శలను పెద్దగా పట్టించుకోను. లోపల నాకు ఆ విషయంలో గిల్టీ ఫీలింగ్ లేదు. ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకుని, ఒకే ఇంట్లో పెట్టలేదు. ఒకరి మీద నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడం నాకు పెద్ద విషయం కాదు. నాకు సంస్కారం, సభ్యత ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మాట్లాడను. ఎవరినైనా వ్యక్తిగతంగా విమర్శించాలంటే నాకు వాళ్ల ఇంట్లో ఆడపడుచులు గుర్తొస్తారు. నా సంస్కారం మాట్లాడనివ్వకుండా ఆపేస్తుంది. ఇప్పుడుకూడా పెద్దలు బాలకృష్ణ ఎదురుగా ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను అంటూ పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ వేదికగా మూడు పెళ్లిళ్ల విషయంపై సూపర్బ్ క్లారిటీ ఇచ్చారు. 

దానితో బాలయ్య కూడా ఇంకోసారి ఆయన గురించి, ఆయన పెళ్లిళ్ల గురించి మాట్లాడితే మీరు ఊరకుక్కలతో సమానమంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

Pawan superb clarity on three marriages:

Unstoppable: Balakrishna-Pawan Kalyan episode 1 highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ