నందమూరి బాలకృష్ణ: కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు కన్నుమూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు.. భారతీయ సంస్కృతీ సంప్రదాయలు మరీ ముఖ్యంగా మన
తెలుగు దనాన్ని అణువణువున ప్రతిబింబించే ల ఆయన తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమా కే గర్వ కారణము..తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చి ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది.
కళా తపస్వి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను..
తారక్: తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాధ్ గారిది ఉన్నతమైన స్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనుకుంటున్నాను.
కళాతపస్వీ దర్శకేంద్రులు, నటులు
నందమూరి రామకృష్ణ: సంగీత దర్శకులు,
✨💐కే.విశ్వనాధ్ గారు💐✨
స్వర్గస్తులవ్వటం మన యావత్
చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటు.
వారు సంగీత సాహిత్యానికి
విలువనిచ్చే గొప్ప మనిషి. వారు
ఎన్నో చారిత్రాత్మక
చిత్రాలకు జీవమిచ్చిన గొప్ప
దర్శకేంద్రులు,
కే.విశ్వనాధ్ గారు. వారి ఆత్మకు
శాంతి చేకూరాలని దైవారాన్ని