Advertisementt

కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ తీవ్ర దిగ్బ్రాంతి

Fri 03rd Feb 2023 07:34 AM
chiranjeevi,k viswanath  కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ తీవ్ర దిగ్బ్రాంతి
Megastar is deeply saddened by the death of K. Vishwanath కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ తీవ్ర దిగ్బ్రాంతి
Advertisement
Ads by CJ

కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నా తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ గారు కాలం చేయడం నన్ను కలచి వేసింది. ఈరోజు ఆయన కన్నుమూసిన వార్త విన్న నేను షాక్ కు గురయ్యాను. ఆయన లాంటి డైరెక్టర్ కన్నుమూయటం నాకే కాదు తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. 

కె.విశ్వనాథ్ గారితో చిరంజీవికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన్ను సొంత కుటుంబ సభ్యుడిలా భావిస్తారు చిరు. ఎప్పటికప్పుడు కె.విశ్వనాథ్ దంపతులను కలుస్తూనే ఉంటారు. తన భార్య సురేఖతో కలిసి కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆయన ఆశ్వీర్వాదం తీసుకుంటూ ఉంటారు.  నటనకు సంబంధించి ఎన్నో మెలుకవులు నేర్పించిన గురువు కె విశ్వనాథ్ గారు.  తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, కె.విశ్వనాథ్‌లది సక్సెస్‌ ఫుల్‌ కాంబినేషన్‌ అనే చెప్పాలి. వీరిద్దరూ కలిసి చేసిన శభలేఖ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. 

ఈ సినిమాలన్నీ మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్స్. అద్భుతమైన సంగీతానికి,  ప్రేమ, ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ ని కలగలిపి కె.విశ్వనాథ్‌ ఈ సినిమాలను రూపొందించారు. ఇవన్నీ కూడా బ్లాక్‌బస్టర్స్ గా నిలిచాయి. ఎప్పటికీ ఎవర్‌ గ్రీన్‌ సినిమాలుగా నిలిచిపోయాయి.

Megastar is deeply saddened by the death of K. Vishwanath:

Legendary director K Viswanath passes away

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ