పాన్ ఇండియా మూవీస్ అంటే తెలుగులో స్టార్ హీరోలకి బాలీవుడ్ విలన్స్ అయినా, లేదంటే కోలీవుడ్ విలన్స్ అయినా, లేదు అంటే మలయాళ విలన్స్ అయినా దిగాల్సిందే. లేదంటే ఏ భాషలో హీరోలతో అయినా విలన్ వేషాలు కట్టిస్తేనే సినిమాపై క్రేజ్ ఉంటుంది. పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నామంటే దానికి సరిపోయే సరుకు అందులో ఉండాలి. ఇప్పటివరకు వచ్చిన పాన్ ఇండియా మూవీస్ లో పుష్పలో అల్లు అర్జున్ కి ఫహద్ ఫాసిల్ విలన్ గా కనబడితే.. ప్రభాస్ చిత్రాల్లో చాలామంది పరభాషా నటులు విలన్స్ గా కనిపిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి.
కానీ ఇప్పుడు రామ్-బోయపాటి మాత్రం పాన్ ఇండియా మూవీ అంటూ అనౌన్స్ చేసేసి షూటింగ్ కూడా చేస్తున్నారు. ఐదు భాషల్లో రామ్ తో బోయపాటి సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి రామ్ హీరోగా వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి విలన్ గా ఏ తమిళ హీరోనో, లేదంటే బాలీవుడ్ నటులనో, మలయాళ నటులనో కాదు కూడదు అనుకుంటే తెలుగులో ఏదో ఒక హీరోని విలన్ గా సెట్ చెయ్యాల్సింది పోయి.. అస్సలు ఫేమ్ లో లేని నటుడిని విలన్ గా తీసుకురావడం ఏమిటో రామ్ అభిమానులకి అంతుబట్టడం లేదు.
తెలుగులో అప్పుడెప్పుడో హీరోగా చేసి.. బిగ్ బాస్ లో కనిపించిన బైక్ రేసర్, బాడీ బిల్డర్ ప్రిన్స్ ని తీసుకొచ్చి రామ్ కి విలన్ గా చెయ్యడం బోయపాటికే చెల్లింది. మరి గతంలో హీరో జగపతి బాబుని పవర్ ఫుల్ విలన్ గా చూపించి సక్సెస్ అయిన బోయపాటి తర్వాత శ్రీకాంత్ ని విలన్ గా పెట్టగా.. ఆయన బాలయ్య ముందు తేలిపోయాడు. ఇప్పుడు రామ్ తో పాన్ ఇండియా మూవీలో ప్రిన్స్ ఎలా సరిపోతాడు అనేది అభిమానుల వాదన. ప్రిన్స్ విలన్ గెటప్ లో బాగానే ఉన్నాడు. తెలుగు ప్రేక్షకుల వరకు ఓకె.. కానీ ఇతర భాషలకి ప్రిన్స్ క్రేజ్ సరిపోతుందా అనేది రామ్ ఫాన్స్ డౌట్.