ఆహా లో క్రేజీ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ప్రసారమవుతున్న సమయంలో యూజర్స్ సర్వర్లు క్రాష్ చెంసేంతగా ఆహా ఓటిటి ని క్లిక్ చేస్తున్నారు. రీసెంట్ గా బాలకృష్ణ-ప్రభాస్ ఎపిసోడ్ ప్రసారమయిన సమయంలో ఆహా ఓపెన్ చేసిన వారికి అన్ రీచబుల్ మెసేజ్ రావడంతో ఫాన్స్ చాలా హార్ట్ అయ్యారు. ఆహా ని లెక్కకు మించిన యూజర్స్ ఒకే టైమ్ లో ఓపెన్ చెయ్యడంతో సర్వర్లు క్రాష్ అయినట్లుగా తెలిసింది. ఇప్పుడు అంతకు మించిన అంచనాలతో వస్తున్న PSPK-NBK ఎపిసోడ్ కి ఆహా సర్వర్లు బ్లాస్ట్ అవ్వడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది.
ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 2 బాలయ్య-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూట్ జరిగి నెలపైనే అయ్యింది. ఇప్పటివరకు గ్లిమ్ప్స్, అలాగే ప్రోమోస్ తోనే ఈ ఎపిసోడ్ పై అంచనాలు పెంచేసిన ఆహా టీమ్.. ఇప్పుడు పవన్ ఫాన్స్, నందమూరి ఫాన్స్, రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు చూడబోయే ఎపిసోడ్ బ్లాస్ట్ అవ్వకుండా ఆపేందుకు ఏం చేస్తుందో కానీ.. ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు చూద్దామా.. ఈరోజు నైట్ 9 ఎప్పుడవుతుందా అని కాచుకుని కూర్చున్నారు ప్రజలు.
అందరూ ఒకేసారి ఓపెన్ చేస్తే ఆహ సర్వర్లు క్రాష్ అవడం పక్కా.. దీని కోసం ఆహా టీం సర్వర్లు క్రాష్ అవ్వకుండా ఎంతమంది చూసినా ఇబ్బంది లేకుండా అంటే ట్రాఫిక్‌ను మేనేజ్ చేసేందుకు వారి సర్వర్ థ్రెషోల్డ్‌లను మెరుగురుస్తున్నారు. యూజర్ ట్రాఫిక్ 2 మిలియన్ కంటే ఎక్కువ ఉంటే క్రాష్ కాకుండా ఉండేందుకు బ్యాకప్ సర్వర్స్‌ను కూడా ఇన్‌స్టాల్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కి ముందు ఉండే ఆత్రుత, ఉత్కంఠ ఇప్పుడు ఆహా అన్ స్టాపబుల్ ఎపిసోడ్ పై ఉంది అంటే నమ్మాలి. అక్కడ థియేటర్స్ లో రచ్చ అయితే.. ఇక్కడ ఆహా కి రచ్చ రంబోలా అన్నమాట.