పూజ హెగ్డే ఇప్పుడు మహేష్ తో మరోసారి నటించేందుకు ఎగ్జైటింగ్ గా ఉంది. టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ లో సక్సెస్ లు అందుకున్న పూజ హెగ్డే కి గత ఏడాది తెలుగులో రెండు భారీ ప్రాజెక్ట్స్ బిగ్ షాక్ నిచ్చాయి. రాధేశ్యామ్, ఆచార్య డిజాస్టర్స్ తో పూజా హెగ్డే నిరాశలోకి వెళ్ళింది. తమిళ బీస్ట్, హిందీ సర్కార్ కూడా పూజ హెగ్డే ని ఆదుకోవడం అటుంచి కోలుకోలేని దెబ్బతీశాయి. బాలీవుడ్ లో ఎలాగైనా హిట్ కొట్టి నిలబడాలని పూజ ప్రయత్నాలు సర్కస్ తో వమ్మయ్యాయి. అయినప్పటికీ సల్మాన్ తో నటిస్తున్న సినిమాపైనే పూజ హెగ్డే హోప్స్ పెట్టుకుంది.
కెరీర్ అలా ఉంటే తాజాగా పూజా హెగ్డే తన సోదరుడు రిషబ్ హెగ్డే పెళ్లి వేడుకలో బెనారస్ సారీ లో కుందనపు బొమ్మలా మెరిసిపోయింది. సోదరుడి వివాహంలో పూజ హెగ్డే ఎంతగా ఎంజాయ్ చేసింది ఆ పిక్స్ చూస్తే తెలిసిపోతుంది. ఇక ఇప్పుడు మరింత గ్లామర్ గా మోడరన్ లుక్ లోకి మారిపోయింది. వైలెట్ కలర్ డ్రెస్ లో పూజ మెరిసిపోతోంది. రొమాంటిక్ గా ఇచ్చిన ఫోజులతో యూత్ కి మత్తెక్కిస్తోంది. హాట్ లుక్స్ తో పూజ హెగ్డే కుర్రమనసులకు కుదురులేకుండా చేస్తోంది.
గ్లామర్ కి గ్లామర్ అందానికి అందం ఆమె సొంతమవడంతో పూజ హెగ్డే అందాలు ఆరబోసేందుకు ఏ విధంగానూ వెనకడుగు వెయ్యడం లేదు. దర్శకులు ఎలా అంటే ఫాలో అవుతుంది. అందుకే స్టార్ ఛాన్స్ లు ఇట్టే పట్టేస్తుంది.