Advertisementt

ఎల్లో ఫ్రాక్ లో ముద్దొస్తున్న సమంత

Thu 02nd Feb 2023 12:26 PM
samantha  ఎల్లో ఫ్రాక్ లో ముద్దొస్తున్న సమంత
Samantha Looking Ethereal In A BTS Video Of Photoshoot ఎల్లో ఫ్రాక్ లో ముద్దొస్తున్న సమంత
Advertisement
Ads by CJ

మైయోసిటిస్ నిర్ధారణ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న సమంతా మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది. సమంత నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ శాకుంతలం విడుదల కావాల్సి ఉంది. సమంత ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి రాజ్ అండ్ DK తెరకెక్కిస్తున్న అమెజాన్ ప్రైమ్ గ్లోబల్ సిరీస్ ఫ్రాంచైజ్ సిటాడెల్‌లో కూడా చేస్తోంది. విజయ్ దేవరకొండ ఆమె తదుపరి చిత్రం ఖుషి షూటింగ్ త్వరలో పునఃప్రారంభం కానుంది. అలాగే సోషల్ మీడియాలోనూ సమంత వర్కౌట్స్ వీడియోస్ తో, ఫోటోషూట్స్ తో యాక్టీవ్ అయ్యింది.

తాజాగా సమంత ఫోటో షూట్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సమంత రౌత్ ప్రభు ఇటీవల ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని ఫోటో షూట్ లో పాల్గొంది. సమంతతో కలిసి తన తాజా షూట్ యొక్క బ్యూటిఫుల్ BTS వీడియోను పంచుకున్నాడు డబ్బూ రత్నాని. వీడియోలో సమంత ఎల్లో ఫ్రాక్ లో బ్యూటిఫుల్ లుక్స్ తో అద్భుతంగా డాన్స్ చేస్తుండగా.. దిల్ తో పాగల్ హైలోని ప్రముఖ బాలీవుడ్ సాంగ్ ముజ్కో హుయ్ నా ఖబర్ బ్యాగ్రౌండ్ లో ప్లే అవుతోంది. 

అనారోగ్యంతో పోరాడి మళ్ళీ తన కెరీర్ లో బిజీ అవుతున్న సమంత నెమ్మదిగా ఉండకుండా.. యాక్టీవ్ గా తనలోని ఎనేర్జి ఏ మాత్రం తగ్గలేదు అని నిరూపించడానికి ఇలాంటి ఫోటో షూట్స్ వదులుతోంది.

Samantha Looking Ethereal In A BTS Video Of Photoshoot:

Samantha Looking Ethereal

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ