ఇప్పుడు రామ్ చరణ్ పరిస్థితి అలానే ఉంది. ఎలా అంటే శంకర్-కమల్ మధ్యలో చరణ్ అన్నట్టుగా. ఎందుకంటే గత ఏడాది ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ తో పాటుగా అప్పుడప్పుడు కూల్ గా RC15 షూటింగ్ చేసుకున్న రామ్ చరణ్ కి కమల్ హాసన్ మధ్యలో ఇండియన్ 2 తో అడ్డుపడ్డారు. శంకర్ పక్కకి తప్పుకున్న ఇండియన్ 2 షూటింగ్ ఖచ్చితంగా చెయ్యాల్సిన పరిస్థితి రావడంతో రామ్ చరణ్, దిల్ రాజు తో మాట్లాడి శంకర్ పదిరోజులు కమల్ ఇండియన్ 2 షూటింగ్, పది రోజులు రామ్ చరణ్ RC 15 షూటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. RC15 మొదలై అప్పుడే ఏడాదిన్నర గడిచిపోయింది.
అసలు ఇప్పటివరకు అధికారికంగా RC15 టైటిల్ కానీ, కనీసం సినిమా గురించి అప్ డేట్ కానీ రాలేదు. దానితో మెగా ఫాన్స్ బాగా డిస్పాయింట్ అవుతున్నారు. RC 15 షూటింగ్ స్పాట్ నుండి ఎప్పటికప్పుడు రామ్ చరణ్ లుక్ లీకై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చెయ్యడమే కానీ, అఫీషియల్ గా చరణ్ లుక్ ని మేకర్స్ రివీల్ చెయ్యలేదు. ఇప్పుడు RC 15 షూటింగ్ అలా అలా నత్తనడకన సాగుతుంది. శంకర్ అటు కమల్ ఇటు చరణ్ మధ్యలో నలిగిపోతున్నారు. ఇండియన్ 2, RC 15 షూటింగ్స్ తో అలిసిపోతున్నారు. దానితో మధ్యలో షూటింగ్స్ కి బ్రేకులు వచ్చేస్తున్నాయి.
అసలు RC 15 వచ్చే ఏడాది సంక్రాంతికి అయినా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది మెగా ఫాన్స్ అనుమానం. దిల్ రాజు ఎలాగైనా 2024 సంక్రాంతికి రామ్ చరణ్ మూవీ కంప్లీట్ చెయ్యాలని చూస్తున్నారు. కానీ శంకర్ వల్ల అవుతుందా.. మధ్యలో ఇండియన్ 2 రిలీజ్ అయ్యాకే RC 15 రిలీజ్ ఉండాలి. సో ఇదంతా ఎప్పటికి పూర్తవుతుందో చూడాలి.