Advertisementt

2 పార్టులుగా ప్రాజెక్ట్ K ?

Wed 01st Feb 2023 06:49 PM
prabhas,project k  2 పార్టులుగా ప్రాజెక్ట్ K ?
Project K to release in 2 parts 2 పార్టులుగా ప్రాజెక్ట్ K ?
Advertisement
Ads by CJ

రాజమౌళి-ప్రభాస్ కలయికలో వచ్చిన బాహుబలి రెండు పార్టులుగా విడుదలై ఇండియా వైడ్ ప్రేక్షకులని ఊపేసింది. బాహుబలి 1 విడుదలయ్యాక పార్ట్2 కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూసేలా చేసారు రాజమౌళి అండ్ ప్రభాస్ లు. సీక్వెల్ అంటే ఆ రేంజ్ లో ఉండాలని బాహుబలితో చూపించారు. అయితే ఇప్పుడు ప్రభాస్.. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో చేస్తున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ K (వర్కింగ్ టైటిల్) కూడా రెండు భాగాలుగా విడుదల కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. బాలీవుడ్ మీడియాలో ప్రత్యేకంగా ప్రాజెక్ట్ K పై ఈ స్పెషల్ న్యూస్ లు వెలువడుతున్నాయి.

నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ K పాన్ వరల్డ్ మూవీగా రెండు భాగాలుగా విడుదల కాబోతుంది అంటూ స్టార్ట్ చేసారు. ప్రభాస్-దీపికా పదుకొనె, దిశా పటాని, అమితాబ్ లు నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రాజెక్ట్ K నుండి ఎప్పుడెప్పుడు అప్ డేట్ వస్తుందా అని ప్రభాస్ ఫాన్స్ మాత్రమే కాదు.. మూవీస్ లవర్స్ అంతా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే అశ్విని దత్ వైజయంతి మూవీస్ నుండి ప్రాజెక్ట్ K పై అప్ డేట్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

భారీ బడ్జెట్ తో భారీ అంచనాలు నడుమ తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K మొదటి భాగం వచ్చే ఏడాది అంటే 2024 ఏప్రిల్ లో విడుదల చేసేందుకు నాగ్ అశ్విన్ అండ్ బ్యాచ్ సన్నాహాలు చేస్తుందట. 

Project K to release in 2 parts:

Prabhas Project K to release in 2 parts

Tags:   PRABHAS, PROJECT K
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ