Advertisementt

అలియా అంతా మాయే..

Wed 01st Feb 2023 09:51 AM
alia bhatt  అలియా అంతా మాయే..
Alia Bhatt latest pic viral అలియా అంతా మాయే..
Advertisement
Ads by CJ

గత ఏడాది బాలీవుడ్ చిన్నది అలియా భట్ లైఫ్ జర్నీ మీడియాకి నిజంగా పెద్ద షాక్. పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అవడంతో హడావిడిగా పెళ్లి చేసేసుకుని తాము తల్లితండ్రులం కాబోతున్నామంటూ అలియా భట్ ఆమె భర్త రణబీర్ కపూర్ ప్రకటించడమే అభిమానులని అయోమయంలో పడేసింది. ఏప్రిల్ 14 న చాలా సింపుల్ గా పెళ్లి పీటలెక్కారు అలియా భట్-రణబీర్ కపూర్ లు. అప్పట్లోనే ఎన్నో అనుమానాలు, ఇంత క్రేజీ జంట తమ పెళ్లి అంత సింపుల్ గా చేసుకోవడమే కాదు, కనీసం రిసెప్షన్ కూడా ఇవ్వలేదు. దానికి కారణం ఈమధ్యనే అలియా భట్ బయటపెట్టింది. హాలీవుడ్ సినిమా షూటింగ్ లో తాను ప్రెగ్నెంట్ అవడంతో తనని జాగ్రత్తగా చూసుకున్నారని చెప్పడంతో ఆమె పెళ్ళికి ముందే తల్లికాబోతుంది కాబట్టే పెళ్లి అంత సింపుల్ గా హడావిడిగా జరిగిపోయింది అనేది అర్ధమైంది.

ఇక వాళ్ళు పేరెంట్స్ అవుతున్నామని చెప్పిన ఐదునెలలకు అలియా భట్ చేతిలో బేబీ ఉంది. బేబీ పుట్టిన నెలకే అలియా భట్ రొటీన్ లైఫ్ లోకి వచ్చేసింది. యోగ, వర్కౌట్స్ అంటూ బరువు తగ్గించేసింది. ఇప్పుడు వరుణ్ ధావన్ తో కలిసి ఓ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. మళ్ళీ చిట్టిపొట్టి డ్రెస్సులతో అలియా భట్ గ్లామర్ గా కనబడుతుంది. గత ఏడాది పెళ్లి, ప్రెగ్నెంట్ అయ్యాక కూడా ట్రిపుల్ ఆర్, బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో హడావిడి చేసిన అలియా భట్ మళ్ళీ ఇప్పుడు బేబీ పుట్టి ఆరు నెలలు గడవకుండానే సినిమా ప్రమోషన్స్ లో వాలిపోయింది. అతి త్వరలోనే రన్వీర్ సింగ్ తో చేస్తున్న రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని షూటింగ్ లోకి వచ్చేస్తుంది అలియా.

గత ఏడాది అలియా భట్ పెళ్లి, పిల్లలు, సినిమా షూటింగ్స్, ఆమె జిమ్, యోగ అన్ని ఓ మాయలా కనబడుతున్నాయంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Alia Bhatt latest pic viral:

Alia Bhatt, Varun Dhawan promotions

Tags:   ALIA BHATT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ